Al-Falah University: అల్‌ఫలా యూనివర్సిటీ మరో బిగ్‌ షాక్.. సభ్యత్వం రద్దు

తాజాగా అల్‌ఫలా యూనివర్సిటీకి మరో బిగ్ షాక్‌ తగలింది. ది అసోసియేషన్ ఆఫ్‌ ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU).. ఆ యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది.

New Update
Association of All Indian Universities Revokes Al-Falah University’s Membership

Association of All Indian Universities Revokes Al-Falah University’s Membership

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు(delhi blast) తర్వాత అల్‌ఫలా యూనివర్సిటీ(AL FALAH UNIVERSITY) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ వర్సిటీకి చెందిన పలువురు వైద్యులే దేశంలో ఉగ్రకుట్రకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్‌ఫలా యూనివర్సిటీకి మరో బిగ్ షాక్‌ తగలింది. ''అసోసియేషన్ ఆఫ్‌ ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్'' (AIU).. ఆ యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అక్కడ సరైన పరిస్థితులు లేవని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది.  

దాని సభ్యత్వం రద్దు చేసిన అనంతరం.. తమ AIU లోగోను కూడా వెంటనే తొలగించాలని అల్‌ఫలా యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి కూడా ఈ లోగోను తప్పకుండా తొలగించాలని హెచ్చరించింది. దీంతో అల్‌ఫలా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ కూడా ప్రస్తుతం పనిచేయడం లేదు. 

Also Read :  పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం..పోలీసుల అదుపులో 10 మంది?

Association Of All Indian Universities Revokes Al-Falah University’s Membership


ఇదిలాఉండగా ఆ యూనివర్సిటీకి నాక్ (National Assessment and Accreditation Council (NAAC) కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో NAAC గుర్తింపు లేకున్నా కూడా గుర్తింపు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు నాక్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆ యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇప్పటికే ఆ యూనివర్సిటీకి చెందిన  డా.షాహిన్‌, డా. ముజమ్మిల్ గనై, డా. అదీల్ అహ్మద్ రథర్, డా.అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ సహా మరికొందరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లందరూ దేశంలో నాలుగు కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ప్లాన్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. 

Also Read :  ఢిల్లీ ఎర్రకోట బాంబ్‌ బ్లాస్ట్‌..ఆత్మహుతికి పాల్పడింది ఉమర్‌నే..

Advertisment
తాజా కథనాలు