/rtv/media/media_files/2025/09/03/kavita-2025-09-03-15-45-34.jpg)
Kavita
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను వేరే పార్టీలో చేరేది లేదని కూడా కవిత క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కవితనే సొంతగా పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరగనున్నాయి. కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపనుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి తదితరులు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
Also Read: కవిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సంచలన రియాక్షన్.. కడుపులో కత్తులతో కౌగిలింతలు
కవిత బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కవిత పోటీ చేసే అవకాశముందని పలువురు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆమె బరిలోకి దిగితే ఈ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. కవిత కొత్త పార్టీ పెట్టనుందని ఇప్పటికే ఆమె సన్నిహితులు చెప్పారు. తెలంగాణ జాగ-ృతి, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి (TBRS), బీఆర్‌ఎస్ పాత పార్టీ పేరు టీఆర్‌ఎస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read: నాడు కేసీఆర్.. నేడు కవిత.. 24 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!
బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన కవిత ఇప్పుడు సొంతంగా రాజకీయాల్లో ఎదగేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఈ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలాఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్‌కు హరీశ్ రావు, సంతోష్ రావు అవినీతి మరకలు అంటించారని కవిత ఆరోపణలు చేయడం దుమారం రేపింది. దీంతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
Also Read: స్కూల్స్, కాలేజీలకు సెప్టెంబర్ 7 వరకు సెలవులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ నేపథ్యంలోనే కవిత బుధవారం కూడా మీడియా ముందుకు వచ్చారు. తన పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ఫొటోతోనే ఇకనుంచి కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్‌లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈసీ తాజా ఆదేశాలు: మొత్తం 3,92,669 మంది ఓటర్లు
ఇదిలాఉండగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఓటర్ల వివరాలను ఈసీ ప్రకటించింది. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. వీళ్లలో 2,04,288 మంది ఉండగా.. 1,88,356 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నట్లు పేర్కొంది. ఓటర్ల లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే సెప్టెంబర్ 17 వరకు అప్లికేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.