/rtv/media/media_files/2025/02/17/T6ZFoKO1PuWXibd1KG6D.jpg)
CM Revanth Reddy
Cm Revanth: కవిత వ్యాఖ్యలపై, బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత BRS లీడర్లు సంతోష్ రావు, హరీశ్ రావులపై చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వాళ్లని వాళ్లే కడుపులో కత్తులతో కౌగిలించుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వేములలో SGD-కార్నింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొత్త యూనిట్ ప్రారంభోత్స కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
కుటుంబ గొడవల్లో తనని తీసుకురావద్దని సూచించారు. హరీశ్ రావు, సంతోష్ రావుల వెనుక తానున్నననే వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండించారు. నాయకుడు ఎవరి వెనుక ఉండడు.. నేను ప్రజల ముందే ఉంటానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. విపరీతంగా అవినీతి సొమ్ము సంపాధించారు.. అందుకే కల్వకుంట్ల కుటుంబంలో వాటాల కోసం వివాదాలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. పాపం ఊరికే పోదు.. చేసుకున్న వారికి చేసుకున్నంత అని విమర్శించారు. వాళ్లళ్ల వాళ్లే తన్నుకొని చస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఒకరు ఒకరు కడుపులో కత్తులు పేటుకొని కౌగిలించుకుంటున్నారు.
— Mana Revanth Anna (@ManaRevanth) September 3, 2025
విపరీత అవినీతి సొమ్ము వల్ల ఆస్తుల పంపకాలలో కొట్టుకు చస్తున్నారు. - సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/xtOHr2Y2Bd
త్వరలొనే బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ తగాదాలతో బీఆర్ఎస్ పార్టీలో వాళ్లని వాళ్లే తన్నుకుంటున్నారని.. వాటితో మాకు ఏ సంబంధం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం లాంటి అద్భుతమైన పార్టీ మీద కేసీఆర్ కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశాడు
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2025
టీడీపీ మీద కుట్ర చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడ సాధించదు – రేవంత్ రెడ్డి pic.twitter.com/V4QGvbI4aV
కాంగ్రెస్ పార్టీని బతకనివ్వమని ఆనాడు ఆయన ఎమ్మెల్యే కాకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ వాళ్ళేతన్నుకుని చస్తున్నారు.. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఎవరూ అక్కర్లేదు.. వాళ్లను వాళ్ళే పొడుచుకుంటారని ఎద్దేవా చేశారు ఆయన. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారు. పాపం ఊరికే పోదు.. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని చెప్పారు.
ఒకరివెనక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు. నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా.. నా వాళ్లకు తోడుగా ఉంటానని చెప్పుకొచ్చారు. వాళ్ళ కుటుంబంలో వాళ్లు వాళ్లు కత్తులతో పొడుచుకుని హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరు అంటున్నారు.
లేదు లేదు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని మరికొందరు ఉన్నారని అంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు చీదరించుకున్న మీ వెనుకాల అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా అని ప్రశ్నించారు. దయచేసి మీ కుటుంబ పంచాయతీలనో… మీ కుల పంచాయతీలోనో.. మమ్మల్ని లాగకండని రేవంత్ రెడ్డి కోరారు.