Punjab Floods: స్కూల్స్, కాలేజీలకు సెప్టెంబర్ 7 వరకు సెలవులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

పంజాబ్‌లో వరదల కారణంగా సెప్టెంబర్ 7 వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్‌లకు సెలవులు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఈ సెలవులు సెప్టెంబర్ 3 వరకు మాత్రమే ఉన్నాయి.

New Update
Punjab Floods

Punjab Floods

దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు పలు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా గత నెల అంటే ఆగస్టు నుంచి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అందులో పంజాబ్ రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. పంజాబ్‌ను వరదలు భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఊహించని ఈ విపత్తు కారణంగా ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో నిరాశ్రయులయ్యారు.

Punjab Flood

దీంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 23 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించింది. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్, ఫిరోజ్‌పూర్, కపుర్తలా, అమృత్‌సర్, తర్న్ తరణ్, హోషియార్‌పూర్, రూప్‌నగర్, బర్నాలా వంటి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విధ్వంసం కారణంగా అనేక జిల్లాల్లో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పంజాబ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్‌లు సెప్టెంబర్ 7 వరకు మూసివేయబడతాయని తెలిపింది. గతంలో ఈ సెలవులు సెప్టెంబర్ 3 వరకు మాత్రమే ఉన్నాయి. 

ఈ భారీ వరదల కారణంగా దాదాపు 1,400 గ్రామాలు నీట మునిగాయి. 3.5 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వరదల కారణంగా ప్రభావితమయ్యారు. ముంచుకొచ్చిన ఈ ఊహించని విపత్తు కారణంగా ఇప్పటివరకు 30 మందికి పైగా మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు సీఎం భగవంత్ మాన్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. NDRF, భారత సైన్యం, BSF, ఇతర సహాయక బృందాలు రక్షణ, సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయి. 

 అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ ప్రజల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నుండి సహాయ ప్యాకేజీని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ విపత్తు గత నాలుగు దశాబ్దాలలో రాష్ట్రం చూసిన అత్యంత తీవ్రమైన వరదలలో ఒకటిగా పలువురు చెప్పుకుంటున్నారు. మరో వైపు పంజాబ్ రాష్ట్రాన్ని వరదలు ఎలా చుట్టుముట్టాయో తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఆ వీడియోలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. ఆ వీడియోలు చూస్తుంటే పంజాబ్ రాష్ట్రం పరిస్థితి ఎంత అధ్వనంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్‌లో భారీ వర్షాల తర్వాత, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరదల గుప్పిట్లో చిక్కుకున్నాయి. రోడ్లు నీటిలో మునిగిపోవడంతో ప్రజలు నీటిలో ప్రయాణిస్తున్నారు. విద్యుత్ స్తంభించిపోయింది. పంజాబ్‌లోని వరదల కారణంగా గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, కపుర్తలా, తరన్ తరణ్, ఫిరోజ్‌పూర్, హోషియార్‌పూర్, అమృత్‌సర్, జలంధర్, రూపనగర్, ఫిరోజ్‌పూర్ మరియు మాన్సాతో సహా కనీసం 12 జిల్లాల్లోని 1,300 గ్రామాలు నీట మునిగాయి. 

Advertisment
తాజా కథనాలు