/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ts-inter-exams-jpg.webp)
ఇంతకు ముందు వరకూ కాలేజీకి వెళ్ళి ఇంటర్ హాల్ టికెట్లను తీసుకొచ్చేవారు. లేదా వెబ్ సైట్లో పెట్టి డౌన్ లోడ్ చేసుకోమని చెప్పేవారు. కానీ ఇప్పుడు హాల్ టికెట్లను విద్యార్థుల మొబైల్ నంబర్లకే పంపిస్తోంది బోర్డు. విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు లింక్ పంపిస్తున్నారు. దాన్ని క్లిక్ చేస్తే హాల్‌టికెట్ వస్తుందని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారి ఒకరు తెలిపారు.
Also Read: Parliament Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం
పరీక్షల సీజన్ మొదలైంది..
మరోవైపు ఈరోజు నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యాయి. మొదట ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. తరువాత అసలు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే విద్యార్థుల మొబైల్ కు పంపించామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు మొదలవనున్నాయి. వారికి కూడా త్వరలోనే హాల్ టికెట్లను పంపిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు.
Also Read: USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్