Telangana: తెలంగాణ వైపు దూసుకొస్తున్న అల్పపీడనం..ఐఎండీ ఏం చెప్పిందంటే!

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.రెండ్రోజుల తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అన్నారు

tg rains
New Update

Telangana:

నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ఆదివారం రాత్రి లేక సోమవారం ఉదయం అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న 2 రోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల మీదుగా ఈ ఆవర్తనం సాగుతుందని  పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో నేటి నుంచి రెండ్రోజులు ఉపరితల ఆవర్తనం ప్రభావం అంతగా ఉండదన్నారు. 

Also Read:  Switzerland: స్విట్జర్లాండ్‌ లో బురఖా పై నిషేధం ఎప్పటి నుంచి అంటే!

నవంబర్ 11, 12 తేదీలలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు. నవంబర్ 13న రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు.హైదరాబాద్ నగరంలో భిన్న వాతావరణం ఉంటుందని చెప్పారు. ఉదయం వేళల్లో చల్లగా.. మధ్యాహ్నం ఎండ కాసినా.. సాయంత్రానికి మేఘావృతమై ఉంటుందన్నారు. ఉదయం వేళ పొగ మంచు కమ్ముకునే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు.

Also Read:  US: ట్రంప్‌ గెలుపు...అమెరికాకు గుడ్‌ బై చెబుతున్న హాలీవుడ్‌ హీరోయిన్లు

ప్రస్తుతం తూర్పు, ఈశాన్య దిశలో గంటల 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపారు.  హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల మేర నమోదు అవుతున్నట్లు వెల్లడించారు.ఇక అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రెండ్రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 

Also Read:  Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్‌..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ!

మిగతా చోట్ల తేలికపాటి జల్లులకు ఛాన్స్ ఉందన్నారు. వర్షం హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకపోవటం మంచిదని చెప్పారు. తీరం వెంట బలమైన గాలులు వీస్తాయన్నారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది.

Also Read:  మంచి మనసు చాటుకున్న ట్రంప్‌.. కమలా పార్టీకి విరాళాలివ్వాలని పిలుపు

#telangana #rain-alert #heavy-rains #weather-updates
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe