మంచి మనసు చాటుకున్న ట్రంప్‌.. కమలా పార్టీకి విరాళాలివ్వాలని పిలుపు

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. డెమోక్రట్లకు విరాళాలు ఇవ్వాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. వారి వద్ద పెద్దగా నిధులు లేవని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

New Update
trump kamala

Trump: అమెరికా ఎన్నికలు,ఫలితాలు వెలువడి అధ్యక్షునిగా ఎన్నికైన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. డెమోక్రట్లకు విరాళాలు ఇవ్వాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. వారి వద్ద పెద్దగా నిధులు లేవని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

Also Read:  Vizag: విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత..

కమలా హారిస్‌ ఎన్నికల ప్రచారంలో 20 మిలియన్‌ డాలర్ల అప్పు ఉందన్న నివేదిక వెలువడిన తర్వాత ఆయన ఈ విషయాలు సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత డెమోక్రట్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ట్రంప్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Also Read:  US: ట్రంప్‌ గెలుపు...అమెరికాకు గుడ్‌ బై చెబుతున్న హాలీవుడ్‌ హీరోయిన్లు

ఈ క్రమంలోనే కమలా హారిస్‌ ప్రచారం కనీసం 20 మిలియన్ల అప్పుతో ముగిసిందని కాలిఫోర్నియా బ్యూరో చీఫ్‌ క్రిస్టోఫర్‌ కాడెలాగో అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హారిస్ ఎన్నికల సమయంలో విరాళాలుగా  US$1 బిలియన్లకు పైగా సేకరించారు.  అక్టోబర్ 16 నాటికి బ్యాంకులో US$118 మిలియన్లు నగదు ఉంది. 

Also Read: New Train Route: ఏపీలో ఈ రూట్‌లో కొత్త ట్రైన్ మార్గం..!

అంతేకాకుండా 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో చాలా ధైర్యంగా, గట్టిగా పోరాడి రికార్డు స్థాయిలో విరాళాలు సేకరించిన డెమోక్రాట్‌ ల వద్ద ఇప్పుడు ఎక్కువ డబ్బు లేదు. డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, "ఈ కష్ట సమయంలో డెమొక్రాట్‌లకు సహాయం చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తాము. పార్టీగా మరింత ఐక్యతను కొనసాగించడానికి మేము అన్ని విధాల సహకరిస్తామని అన్నారు. 

Also Read: TCS: ఆఫీసుకొస్తేనే బొనస్‌ ఇస్తానంటున్న టీసీఎస్‌!

ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం, కమలా హారిస్ ఎన్నికల ప్రచారానికి,  ఆమె సూపర్ PACలు US$2.3 బిలియన్లను సేకరించి US$1.9 బిలియన్లు ఖర్చు చేశాయి. మరోవైపు, ట్రంప్ బృందం US $ 1.8 బిలియన్లకు పైగా సేకరించి US $ 1.6 బిలియన్లను ఖర్చు చేసింది.


 కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో భాగమైన అజయ్ జైన్ భూటోరియా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఒక బిలియన్ US డాలర్లకు పైగా సేకరించి ఖర్చు చేసినప్పటికీ, కమలా హారిస్ 2014 ఎన్నికల వాయిస్ ఆ ఓటర్లను చేరుకోలేకపోయింది. కానీ ఆమె చేయలేకపోయింది. పెరుగుతున్న ఖర్చులతో పోరాడుతున్న మధ్యతరగతి అమెరికన్ల మధ్య పెరుగుతున్న అంతరాన్ని పూడ్చలేమన్నారు.

కీలక ఓటర్ల మద్దతు కోల్పోయింది

అజయ్ జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "డెమోక్రాట్లు ధనవంతులు,  హాలీవుడ్ నుండి మద్దతు పొందారు. వారు కీలకమైన ఓటర్ గ్రూపుల మద్దతును మాత్రం కోల్పోయారు. అదనంగా, హారిస్ ప్రచారం ప్రధాన జాతి సమాజాలలో కూడా గణనీయమైన మార్పులను చూసింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు