రాజాసింగ్ పై 3 కేసులు | Case Filed Against MLA Raja Singh | Srirama Navami Shoba yatra | BJP | RTV
బీజేపీలోని కొందరు తనకు ఎప్పుడు వెన్నుపోటు పొడవాలా అనే ఆలోచనతోనే ఉన్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ తనపై పీడీ యాక్డ్ ప్రయోగించి జైలుకు పంపిందని అప్పుడు బీజేపీ నేతలు పోలీసులకు సపోర్ట్ గా నిలిచారన్నారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇవాళ ఉదయం మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత నెల రోజులుగా చంపేస్తామంటూ ఆయనకు ఆగంతకుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. భద్రతా కారణాల వల్ల తనకు గన్ లైసెన్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి ఫోన్లలో గన్నులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటోలు ఉండడంతో హత్యకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అక్బరుద్దీన్ వార్నింగ్‌కు సీఎం రేవంత్ భయపడి ఫాతీమా కాలేజీని కూల్చట్లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. 'హైడ్రా కాదు.. హై డ్రామా. ఎంఐఎంతో కాంగ్రెస్ కాంప్రమైజ్ అయిందా? ఆ కాలేజీ కూల్చేదాకా రేవంత్ జీరోనే' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన GST స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ స్కామ్‌లో వెయ్యి కోట్లకు పైగా అనినీతి జరిగిందని ఆరోపించారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి సందర్భంగా అనుమతి లేకుండా శోభయాత్ర నిర్వహించడంతో రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఐపిసి 188, 290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.