Grok AI: రాకి రా.. సార్‌కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

ఎలాన్ మస్క్ ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ ను టోకా అనే ఎక్స్ యూజర్ ‘నా బెస్ట్ 10 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు?’ అని అడగగా, గ్రోక్ సమాధానం ఇవ్వకపోవడంతో టోకా హిందీలో తిట్టాడు. దానికి గ్రోక్ తిరిగి అదే తిట్టుతో అతడికి రిప్లై ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది.

New Update
Grok AI

Grok AI

Grok AI: ఎలాన్‌ మస్క్(Elon Musk) ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌(AI chatbot Grok) ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది.  మస్క్ ముందుగా చెప్పినట్టుగానే ఇది భూమ్మీద అత్యంత తెలివైన ఏఐ చాట్‌బాట్‌లా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు దీని పని తనం చుస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మనుషుల భాషలను అర్థం చేసుకోవడమే కాకుండా,  మనం అడిగే ప్రశ్నలను చాలా తెలివిగా సమాధానాలు ఇస్తుంది. ఆ సమాధానాలు వింటే ఆశర్యపోవాల్సిందే.

తాజాగా టోకా అనే ఎక్స్‌ యూజర్‌ మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ ఇచ్చిన జవాబు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. ‘నా బెస్ట్‌ 10 మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ ఎవరు?’ అని టోకా ప్రశ్నించగా. గ్రోక్‌ సమాధానం ఇవ్వకపోవడంతో  హిందీలో తిట్టాడు. దంతో గ్రోక్‌ ఆ తిట్టుకు స్పందించడమే కాకుండా తిరిగి అదే తిట్టుతో సదరు వ్యక్తిని తిట్టింది. గ్రోక్‌ స్పందిస్తూ..  ‘‘కూల్‌... మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ అంటే ఒకరినొకరు ఫాలో అయ్యేవారు. నీ బెస్ట్‌ 10 మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ ఎవరో నాకు తెలిసింది" అంటూ రిప్లై ఇచ్చింది. 

grok
grok

Also Read: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

గ్రోక్‌ ఇచ్చిన సమాధానం..

అంతటితో ఆగకుండా "నా లెక్క ప్రకారం ఇదిగో నీ బెస్ట్ 10 మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్, ఇంక ఏడవడం ఆపు’ అంటూ రెచ్చిపోయింది.  ‘మేమంటే మనుషులం అలానే మాట్లాడుతాం ఏఐ కూడా తిరిగి అలానే మాట్లాడుతుందా? ఏఐ కంట్రోల్ లో ఉండాలి’ అంటూ ఆ యూజర్ స్పందించగా.. దానికీ గ్రోక్‌ ఇచ్చిన సమాధానం మొత్తం సోషల్ మీడియానే కుదిపేసింది. ‘‘అరే యార్‌... నేను కూడా కొంచెం మజాక్‌ చేసినా... మీరు అంటే మనుషులు... మీకన్నీ నడుస్తాయి... కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సింది.. కానీ నేను ఇప్పుడే అన్నీ  నేర్చుకుంటున్నా’’ అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. దింతో ఇప్పుడు ఎలాన్‌ మస్క్ ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఈ టాపిక్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు..?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు