/rtv/media/media_files/2025/03/19/KWMOYK3X5RyVUrMXpUMw.jpg)
Manipur riots 123 Photograph: (Manipur riots 123)
Manipur Riots: ఈశాన్య రాష్ట్ర మణిపూర్(Manipur)లో మళ్లీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. హమర్, జోమీ తెగల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. ఆదివారం హమర్ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హమర్, జోమీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అయితే రెండు తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంస్థలు శాంతి అవగాహనకు వచ్చాయి. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరోసారి ఘర్షణ జరిగింది. ఇరు తెగలు రాళ్లు రువ్వుకున్నారు. సాయుధులైన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో 53 ఏళ్ల వ్యక్తి మరణించాడు. పలువురు గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా మణిపూర్‌లో మైతీ, కూకీ తెగల మధ్య ఘర్షణలు అవుతున్న విషయం తెలిసిందే.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
SUMMARY OF LAST NIGHT’S INCIDENT IN CHURACHANDPUR
— BiMoL L (@Bimol27lyz) March 19, 2025
From the Zomi community in Manipur @zsfghq_official
Kukis and Hmar take down our Flag in our own territory, so we went to put it back last night. This Kuki came to make trouble. About 20 Zomi were at the Sielmat bridge… pic.twitter.com/0wtD8gGmBF
భద్రతా బలగాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గుంపులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు జరిపారు. రాజధాని ఇంఫాల్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని చురచంద్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 17న కుకీ, జో తెగల ఆధిపత్యం ఉన్న ఈ జిల్లాలో జోమీ సాయుధ సమూహం జెండాను తొలగించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారు. మరో వర్గం నేతలు దీనిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జోమి, హరమ్ తెగలకు చెందిన వారు గుంపులుగా చేరుకున్నారు.
Also read: Bus fire accident: ఉద్యోగానికి వెళ్తున్న నలుగురు బస్సులో సజీవదహనం
Also read: Mobile blast : ఆగమైపోయిన అరవింద్.. జేబులో ఫోన్ పేలి యువకుడి ప్రైవేట్ పార్ట్ బ్లాస్ట్