Kodandaram : గవర్నర్ కోటాలో కాకుండా ఇతర కోటాలో mlc ఇచ్చి ఉంటే...సుప్రీం కోర్టు తీర్పుపై కోదండరాం..

తన ఎంపిక చెల్లదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ జనసమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు.  సుప్రీం కోర్టు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే అని ఆయన అన్నారు.ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదన్న ఆయన  దీనిపై మాట్లాడటం సరికాదన్నారు.

New Update
Kodandaram

Kodandaram : తన ఎంపిక చెల్లదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ జనసమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు.  సుప్రీం కోర్టు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే అని ఆయన అన్నారు.ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదన్న ఆయన  దీనిపై మాట్లాడటం సరికాదన్నారు. ఈ విషయంలో అసలు పాత్రధారి ప్రభుత్వమే అని, ఏదైనా మాట్లాడాల్సి వస్తె ప్రభుత్వమే మాట్లాడాలన్నారు. దీనిపై ఇంకా CM తో మాట్లాడలేదని కోందండరాం అన్నారు.

ఇది కూడా చదవండి: బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి స్పాట్‌లోనే 10 మందికి..

ప్రభుత్వానికి న్యాయసలహాదారులు ఉంటారన్న ఆయన వారు అన్ని తెలుసుకుంటారన్నారు. ఏదైనా అవసరం అయితే ప్రభుత్వంతో మాట్లాడతానని, కోర్టు గత తీర్పులపై అవగాహన ఉంటే ఇంతవరకు వచ్చేది కాదన్నారు.తుది తీర్పు అనంతరం వివరంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. గవర్నర్ కోటలో కాకుండా ఇతర కోటలో mlc ఇచ్చి ఉంటే బాగుండేదని మనకు సానుకూలంగా ఉండే వారు అంటూ ఉంటారు. కానీ ఏ తోవలో వెళ్ళినా ఎదురు దెబ్బలు సహజం అని వేదంత దోరణిలో మాట్లాడారు. ప్రజా జీవితంలో ఇవన్నీ సహజం అన్న కోదండరాం..కృంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. నిన్నటిలానే రేపు ఉంటానన్నారు.

ఇది కూడా చదవండి: ఆర్కే బీచ్‌లో విషాదం.. అలల తాకిడికి ఓ కుటుంబం...

తీర్పు వచ్చినప్పుడు అమెరికా నుంచి ఇండియాకు వచ్చే దారిలో ఉన్నాను. నిన్న హైదరాబాద్ వచ్చాక పేపర్ లో విషయం చూసానని తెలిపారు. ప్రజా జీవితంలో రాళ్ళు ఉంటాయి పూలు ఉంటాయి. వచ్చిన వాటిని స్వీకరించి ముందుకి వెళ్ళాలి. ఈ విషయంలో గవర్నర్‌ ఏం చేస్తారు అని కోదండరాం ప్రశ్నించారు.

Also Read : దేశానికి స్వాతంత్రం వచ్చినా..హైదరాబాద్ మాత్రం చీకట్లోనే...ఎందుకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు