Telangana : ఎమ్మెల్సీలను నియమించిన గవర్నర్
గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీలను నియమించారు గవర్నర్ తమిళిసై. ఎమ్మెల్సీలు గా తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమేర్ అలీ ఖాన్ ను నియమించారు.
గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీలను నియమించారు గవర్నర్ తమిళిసై. ఎమ్మెల్సీలు గా తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమేర్ అలీ ఖాన్ ను నియమించారు.
తెలంగాణలో నియంతృత్వ పోకడ వల్లే అధికారం కోల్పోయామని బీఆర్ఎస్ నేతలు గుర్తించలకపోతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భయాలు, ఆంక్షలు చూశామని.. ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అయితే.. అనేక మంది నేతలు పోటీలో ఉన్నా.. అద్దంకి దయాకర్, కోదండరాం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కోటాలో మైనంపల్లి హన్మంతరావు కూడా రేసులో ఉన్నారు.
తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆయన్ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే, టీఎస్పీఎస్సీ చైర్మన్‌గానూ నియమించే అవకాశం కనిపిస్తోంది.