Anugula Rakesh Reddy : ఆ నేరం మళ్లీ మళ్లీ చేస్తా….రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం నోటీసులు జారీ చేసింది. స్పందించిన రాకేష్ రెడ్డి అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తానన్నారు.

New Update
Anugula Rakesh Reddy

Anugula Rakesh Reddy

Anugula Rakesh Reddy : టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ(TGPSC) పరువునష్టం దావా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో స్పందించిన రాకేష్ రెడ్డి అంతే గాటుగా సమాధానమిచ్చారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..టీజీపీఎస్సీ నోటీసులకు త్వరలోనే సమాధానం ఇస్తానని అన్నారు. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఈ సందర్భంగా ఆయన.. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తానని అన్నారు. జైల్లో బంధిస్తే జైలు గోడల మీద నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించిన కవి దాశరథి గారు పుట్టిన ఓరుగల్లు నేల పై పుట్టిన బిడ్డను తనని, ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. గ్రూప్ -1 పరీక్షల్లో జరిగిన అవకతవలకు పై ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని సహేతుకంగా ప్రశ్నించినందుకు నాపై పరువునష్టం దావా వేశారని తెలిపారు. ప్రశ్నిస్తేనే మీ పరువు పోతే మరి, మీవల్ల జరిగిన అవకతవకల వల్ల జీవితాలను కోల్పోతున్న నిరుద్యోగులు ఏం చేయాలి? అని సూటిగా ప్రశ్నించారు. అంతేగాక గతంలో నేడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇదే టీఎస్‌పీఎస్సీ పైన రోడ్డెక్కి ఎన్నో విమర్శలు చేశారని, మరి అప్పుడెందుకు ఇలాంటి నోటీసులు ఇవ్వలేదు..? అని నిలదీశారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

 బీఆర్ఎస్ పార్టీకి, నాయకత్వానికి కేసులు కొత్తకాదు.. పోరాటం కొత్తకాదు.. ఆ స్ఫూర్తితోనే విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతామని, మీ ఇజ్జత్ దావాకు ఇగురంగానే త్వరలోనే సమాధానం ఇస్తాను అని రాకేష్ రెడ్డి రాసుకొచ్చారు. కాగా ఇటీవల విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఆరోపణలపై సీరియస్ అయిన టీజీపీఎస్సీ రాకేష్ రెడ్డి‌కి నోటీసులు జారీ చేసింది. టీజీపీఎస్సీపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని, లేకుంటే పరువు నష్టం, క్రిమినల్ కేసులు దాఖలు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది.ఇకపై భవిష్యత్తులో టీజీపీఎస్సీపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆంక్షలు విధించింది.

Also Read: గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు