హైడ్రా‘మా’ అయిపోయిందా.. ఐదు నెలల క్రితం వార్తల్లో మొత్తం హైడ్రా హడల్. హైదరాబాద్ ప్రజల్లో జేసీబీల భయం. మరి ఇప్పుడు ఏం అయ్యింది హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ( HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇప్పుడు సైలెంట్ ఉన్నారు ఎందుకు. హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు ఆక్రమణలను పూర్తిగా హైడ్రా అరికట్టిందా ? గ్రేటర్ పరిధిలో ఇక భూకబ్జాలు లేవా?
Also Read: తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్..రప్పా రప్పా అంటూ బీజేపీ పోస్టర్ వార్..
హైడ్రా ప్రధాన ఉద్దేశ్యం
హైదరాబాద్‌లో ఆక్రమణకు గురైన చెరువులు, నాలాలను స్వాధీనం చేసుకొని.. ప్రభుత్వానికి అప్పగించడమే హైడ్రా పని. ప్రభుత్వ భూముల కబ్జాలు నివారించడం, ఆక్రమించిన చెరువుల్లో నిర్మాణాలను తొలగించడం, హైదరాబాద్‌లో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం, హైదరాబాద్ ఆస్తులను కాపాడటం హైడ్రా ప్రధాన లక్ష్యం. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి పని చేస్తోంది. ఫోకస్ అంతా ట్రాఫిక్ మీద పెట్టింది. హైడ్రా సిబ్బందికి ట్రాఫిక్ క్లియరెన్స్ శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ పోలీసులకు తోడుగా ఉంటుంది. అంతేకాదు జీహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఇప్పుడు రోడ్డు ఫుట్‌ఫాత్‌లో ఉన్నా అక్రమ నిర్మాణలను తొలగిస్తుంది.
Also Read: ఆధ్యాత్మిక ముసుగులో 20 మందిని భార్యలుగా.. మతనాయకుడికి 50 ఏళ్లు..
హైడ్రా నిర్మాణం..
రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జీవో ఎంఎస్ నంబర్ 99 ద్వారా ‘హైడ్రా’ను ఏర్పాటు చేసింది. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆర్డినెన్స్‌తో జీహెచ్‌ఎంసీ చట్టం–1955లో కొత్తగా 374–బీ సెక్షన్‌ను చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం.. కార్పొరేషన్, ప్రభుత్వ ఆస్తులను రక్షించే అధికారం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి వెళ్తుంది. కార్పొరేషన్, కమిషనర్‌లకు సంబంధించిన అధికారాలను ఎవరైనా అధికారికి, లేదా ఏజెన్సీకి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. స్వయం ప్రతిపత్తి గల హైడ్రాకు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీహెచ్‌ఎంసీ మేయర్ కి కూడా ఇందులో చోటు కల్పించారు. హైడ్రాకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: బంకర్ లో విలువైన వస్తువులు..సిరియా అధ్యక్షుడి ప్రైవేట్ బంకర్ చూశారా?
హైదరాబాద్ ఆస్తులు కాపాడిందా?
దాదాపు గత 3 నెలల్లో 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చి వేశామని వాటి ద్వారా 111. 71 ఎకరాల కబ్జా భూమిని స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెండు నెలల క్రితం రిపోర్ట్ లో తెలిపారు. సినీ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెషన్ హాల్ కూల్చివేతతో హైడ్రా నిత్యం వార్తల్లో నిలిచి ఫేమస్ అయ్యింది. ఫిల్మ్ నగర్ లోని లోటస్ పాడ్ దగ్గర హైడ్రా ఫస్ట్ కూల్చివేత జూన్ 27 చేసింది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా రిపోర్ట్‌లో వెల్లడించింది. విల్లాలు, పెద్ద పెద్ద బిల్డింగులు సైతం హైడ్రా కూల్చివేసింది.
మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజుల రామారం, అమీర్పేట్లో అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసినట్లు హైడ్రా పేర్కొంది. అమీన్ పూర్, మాదాపూర్, కూకట్ పల్లి, ఇంకా ఇతర ప్రాంతాలోని జలాశయాల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసింది. రోజువారి కూలీ చేసుకోని బతికే సామన్య ప్రజల ఇళ్లను కూడా హైడ్రా కూల్చివేసింది. నోటీసులు కూడా ఇవ్వకుండా సడెన్ గా కూల్చివేతలు చేశారని బాధితులు కోర్టుకెక్కారు. హైకోర్టు హైడ్రా కూల్చివేతల్లో అధికారులపై ఫైర్ అయ్యింది. ప్రభుత్వ సంస్థలు పొలిటికల్ బాస్‌ల కోసం పని చేయొద్దని, ప్రజల కోసమే ప్రభుత్వ అధికారులు పని చేయాలని హైకోర్టు హైడ్రాకు మొట్టికాయలు వేసింది. కూల్చివేతలు చట్టప్రకారమే జరగాలని సూచించింది. ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.
అంతకుముందు హైడ్రా ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొంతమంది వేసిన కేసులో హైకోర్టు హైడ్రాను సమర్థించింది. చట్టప్రకారమే హైడ్రా ఏర్పడిందని స్పష్టం చేసింది. దీంతో హైడ్రా కూల్చివేతలు కొనసాగించింది.
Also Read: తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం..స్కూళ్లలో ఆ ఫొటోలు తప్పనిసరి
ఇప్పుడు ఏం చేస్తోంది
ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలను తగ్గించింది. వర్షకాలంలో ప్రజల ఇబ్బందులను తీర్చడానికి పని చేసింది. హైకోర్ట్ ఫైర్ అయిన దగ్గరి నుంచి హైడ్రా దూకుడు తగ్గించింది. ఇప్పటికే నిర్మించి ఉన్న పేదల ఇళ్ల జోలికి వెళ్లమని హైడ్రా కమిషన్ రంగనాథ్ చెప్పారు. అయితే అప్పటికే హైడ్రా వల్ల వందల మంది నిర్వాసితులు అయ్యారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. హైడ్రా ఇప్పుడు మహానగరంలో ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయడానికి ఫుట్‌పాత్ లను టార్గెట్ చేసింది. రోడ్డు మీద షెడ్డులు ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు కలిగించే ఫుట్‌పాత్‌లపై ఉన్న షాప్‌లను కూల్చివేస్తోంది. అంతేకాదు ప్రజల నుంచి హైడ్రా ఫిర్యాదులను కూడా తీసుకుంటోంది. భూకబ్జాలకు గురైన ఫిర్యాదుల్లో విచారణ చేసి నోటీసులు ఇస్తున్నారు.
ఆరోపణలు ఏమున్నాయ్!
కేవలం రాజకీయ కక్ష్యతోనే కొందరిని టార్గెట్ చేసి హైడ్రా కూల్చివేతలు చేసిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి భూకబ్జాల జోలికి హైడ్రా వెళ్లలేదని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అమాయకపు పేద ప్రజల గుడిసెలు కూడా కూల్చివేశారని అన్నారు.
ఇదిలా ఉండగా.. హైడ్రాను కొందరు సమర్థించారు. హైదరాబద్ లోనే కాదు. జిల్లా కేంద్రాల్లో, ప్రధాన నగరాల్లో కూడా భూకబ్జాలను అరికట్టడానికి హైడ్రా లాంటిది కావాలని కోరారు. భవిష్కత్‌లో హైదరాబాద్‌ను వరదలు, ప్రకృతి విపత్తుల నుంచి రక్షించడానికి హైడ్రా అవసరమని సంతోషం వ్యక్తం చేశారు.