Delhi:తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్..రప్పా రప్పా అంటూ బీజేపీ పోస్టర్ వార్..

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో అక్కడ రాజకీయాలు బాగా వేడెక్కెతున్నాయి. ఈ క్రమంలో పార్టీ మధ్య పోస్టర్ వార్ మొదలైంది. తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్‌ ఫొటో పోస్టర్‌ తో ఆప్.. రప్పా-రప్పా అంటూ బీజేపీ పోస్టర్లను దించాయి.

New Update
war

కాదేదీ ఎన్నికలకు అనర్హం అన్నట్టు తయారయింది ఢిల్లీలో పరిస్థితి. దేశ రాజధానిలో నువ్వా నేనా అన్నట్టు ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆప్ ప్రయత్నాలు చేస్తుంటే..క్యాపిటల్‌ను దక్కించుకోవాలని బీజేపీ ఉత్సాహం చూపిస్తోంది.ఆమ్‌ఆద్మీ పార్టీ వరుసగా గెలుస్తూ వస్తోంది. 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్‌.. ఈసారి కూడా అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  

పోస్టర్ వార్..

ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు తెగ ప్రచారాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరి మధ్యా పోస్టర్ వార్ నడుస్తోంది. తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్‌ ఫొటోతో కూడిన ఓ పోస్టర్‌ను ఆప్‌ విడుదల చేయగా.. బీజేపీ కూడా రప్పా-రప్పా  అనే పోస్టర్ ను విడుదల చేసింది. ఆప్ పార్టీ కేజ్రీవాల్‌ను పుష్ప గా చేసేసింది. పుష్ప సినిమాలో హీరో పోజులో ఉన్న కేజ్రీవాల్‌.. చీపురు చేత పట్టుకొని ఉన్నట్టు పోస్టర్ క్రియేట్ చేసింది. నాలుగోసారి మళ్లీ అధికారం తమదే అనే అర్థంలో ఆ పోస్టర్‌ను రూపొందించారు.

1

దీనికి ధీటుగా బీజేపీ కూడా పోస్టర్‌‌ను విడుదల చేసింది. వీళ్ళు కూడా పుష్ప స్టైలునే దించేశారు. ఇందులో  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌.. పుష్ప క్యారక్టెర్‌ తరహాలోనే కుర్చీలో కూర్చున్నట్లు దానిని రూపొందించారు. అవినీతిపరులను అంతం చేస్తామంటూ.. రప్పా-రప్పా అని రాసి విడుదల చేశారు.  ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంతవరకూ ఈ హడావుడి నడవనుంది. దీంతో పాటూ సోషల్ మీడియాలో కూడా రెండు పార్టీలు హల్ చల్ చేస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు తమ పార్టీలకు అనుకూలంగా పోస్ట్‌లు పెడుతూ హంగామా చేస్తున్నారు. 

2

Also Read: USA: మెక్సికో, కెనడా రెండూ అమెరికాలో విలీనవ్వడమే మంచిది– ట్రంప్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు