TG News: పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయులు చేస్తున్న అరాచకాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరికొందరు ఉపాధ్యాయులు చేస్తున్న పనికి విద్యాశాఖ సంచనల నిర్ణయం తీసుకున్నది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, కేజీబీవీ, మోడల్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల ఫోటోలు కచ్చితంగా పెట్టాలని విద్యాశాఖ సంచాలకుడు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈవి నర్సింహారెడ్డి ఆదేశించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం పాఠశాలలో ఒకరి బదులు ఒకరు బోధనలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గ్రామానికి చెందిన యువతీ, యువకులతో బోధన:
అయితే పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల ఫోటోలు పెట్టాలని కేంద్ర విద్యా శాఖ ఎన్నోసార్లు ఆదేశించినప్పటికీ.. తాజాగా విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఖమ్మం జిల్లాలో కొన్ని మారుమూల ప్రాంతాలలో ఉన్న సీనియర్ టీచర్లు రూ. పది వేల వరకు జీతం ఇచ్చి ఆ గ్రామానికి చెందిన యువతీ, యువకులతో బోధనకు నియమించినట్లు సమాచారం వచ్చింది.
ఇది కూడా చదవండి: ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు.. క్యాన్సర్‌ను చంపాలంటే..
ఖమ్మం తో పాటు హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాలలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇతర డ్యూటీలు సౌకర్యం లేకుండా పాఠశాలకు నెలల తరబడి హాజరు కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో కూడా ఇలానే కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: చెట్ల పొదల్లో రొమాన్స్..మరో లడ్డు కావాలా నాయనా
ఇది కూడా చదవండి: శీతాకాలంలో తినాల్సిన సూపర్ పండు ఇదే