/rtv/media/media_files/2025/07/04/vivo-phone-2025-07-04-15-51-57.jpg)
VIVO Phone Blast
VIVO Phone Blast: నిత్యం ఫోన్లు పేలిపోతున్న ఘటనలు ఎక్కడో ఒక దగ్గర చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ యువకుడి జేబులో ఉన్న వీవో(Vivo) స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆ యువకుడి తొడకు తీవ్రగాయమైంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్(Attapur)లో జరిగింది. పెయింటర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే యువకుడు వీవో స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. ఫోన్ జేబులో పెట్టుకుని బయటకు రాగా హిట్ అవ్వడంతో ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు రావడంతో శ్రీనివాస్ తొడకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్లు. వెంటనే అప్రమత్తం కాకపోయి ఉంటే మాత్రం కండరాల్లోకి వెళ్లి తీవ్రంగా నష్టం జరిగేదని చెప్పారు.
Also Read:కెచప్‌తో రోటీ పరోటా పిల్లలకు ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?
రాజేంద్రనగర్ అత్తాపూర్ సమీపంలోని శ్రీనివాస్ అనే యువకుడు వివో ఫోన్ వాడుతున్నాడు. తన ప్యాంటు జేబులో పెట్టుకొని వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఫోన్ హీటెక్కి మంటలు రావడంతో వెంటనే జేబులో నుంచి వివో మొబైల్ ఫోన్ తీశాడు, అప్పటికే శ్రీనివాస్ ఫోన్ హీట్ వల్ల తీవ్రంగా కాలు కాలింది.… pic.twitter.com/FRY9xR7M6E
— TNews Telugu (@TNewsTelugu) July 4, 2025
ఛార్జింగ్ పెట్టి ఫోన్
ఇలాంటి సంఘటనే మే 25వ తేదీన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అలీఘర్ జిల్లాలోని ఛరా పరిధిలో ఓ యువకుడి ఐ ఫోన్ పేలింది. అదే విధంగా మే 23న ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటీలో బీటెక్ విద్యార్థి ఫోన్ తన జేబులో పేలిపోగా అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడకూడదని, ఫోన్ ఓవర్ హీట్ అయితే జేబుల్లోంచి తీసి కాస్త చల్లటి ప్రదేశంలో పెట్టాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Samantha: అతడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా .. సామ్ కామెంట్స్ వైరల్
Also Read:Mouni Roy: ఆకుపచ్చ చీరలో నడుమందాలు చూపిస్తూ మౌని గ్లామర్ షో! ఫొటోలకు ఫిదా అవ్వాల్సిందే