/rtv/media/media_files/2025/07/04/samantha-tatoo-2025-07-04-11-29-40.jpg)
Samantha tatoo
Samantha: ఈ మధ్య నటి సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు సామ్ టాటూకి సంబంధించి మరో వార్త వైరల్ గా మారింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ తన మొదటి టాటూ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను 18 ఏళ్ల వయసులో మొదటి టాటూ వేసుకున్నట్లు తెలిపింది. అప్పుడు తాను ప్రేమలో ఉన్నానని.. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని భావించి టాటూ వేసుకున్నానని చెప్పింది. అయితే ఆ ప్రేమించిన వ్యక్తి ఎవరో మాత్రం చెప్పలేదు సామ్. అలాగే ఆ టాటూ ఎక్కడ ఉందో కూడా చెప్పనని చెప్పారట. ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టీవ్
ప్రస్తుతం సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. తరచూ ఫిట్ నెస్, యోగా, మెంటల్ హెల్త్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఓవైపు నటిగా రాణిస్తూనే..మరోవైపు ప్రొడక్షన్ రంగంలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా బ్యానర్ పై సామ్ నిర్మించిన తొలి సినిమా 'శుభం' సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సమంత రాజ్ అండ్ డీ దర్శకత్వంలో 'రక్ష్త్ బ్రహ్మండ్' సీరీస్ చేస్తోంది. దీంతో పాటు తన సొంత ప్రొడక్షన్ లో 'మా ఇంటి బంగారం' మూవీ కూడా చేస్తోంది.
Also Read: Tamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. స్టిల్స్ పిచ్చేక్కించేసిందిగా!
ఇదిలా ఉంటే సామ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో డేటింగ్ లో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ, మరోవైపు వారిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమేనని.. ఇంకేమీ లేదని సామ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆమధ్య సామ్ కి సంబంధించిన ప్రతీ ఈవెంట్స్ లో, ఫొటోల్లో రాజ్ కనిపించడంతో ఈ రూమర్లు మొదలయ్యాయి.
Also Read:Mouni Roy: ఆకుపచ్చ చీరలో నడుమందాలు చూపిస్తూ మౌని గ్లామర్ షో! ఫొటోలకు ఫిదా అవ్వాల్సిందే