Miss World: సుచాతను మిస్ వరల్డ్ చేసిన ఆన్సర్ ఇదే..

మిస్‌ వరల్డ్‌ 2025 విజేతగా థాయ్‌లాండ్‌ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ ఎంపికయ్యారు. ఫైనల్‌ రౌండ్‌లో టాప్‌ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్‌లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. వీరిలో అత్యుత్తమ సమాధానంతో సుచాత కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదేంటి?

New Update
hyd

Miss World Opal Suchata

మిస్‌ వరల్డ్‌ 2025 కిరీటాన్ని థాయ్‌లాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్‌గా ఇథియోపియా భామ హాసెట్‌ డెరెజే, రెండో రన్నరప్‌గా మిస్‌ పోలండ్‌ మయా క్లైడా, మూడో రన్నరప్‌గా మార్టినిక్‌ భామ ఆరేలి జోచిమ్‌ నిలిచారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన ఫైనల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 2024 మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిజ్కోవా...సుచాతకు కిరీటాన్ని అలంకరించారు. సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌ మనీ అందించనున్నారు. 21 ఏళ్ల సుచాత ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ స్టూడెంట్, మోడల్‌. థాయ్ లాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అందగత్తెగా ఓపల్ నిలిచారు. 

Also Read :  ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్‌పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్

Also Read :  ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా - పోలీస్ స్టేషన్ మెస్‌లోనే రేప్!

సుచాత సమాధానానికి పడిపోయిన జడ్జిలు..

ఫైనల్ రౌండ్ లో కు వచ్చిన అందగత్తెలను జడ్జిలు ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎవరు అత్యుత్తమంగా ఆన్సర్ చెబితే వారే విజేతగా నిలుస్తారు. ఇదే థాయ్ లాండ్ సుందరి ఓపల్ సుచాతను కూడా విజేతగా నిలబెట్టింది. ఫైనల్ రౌండ్ కు రానా, సోనూసూద్ తో పాటూ మరికొందరు వచ్చారు. ఇందులో సోనూసూద్ ఈ జర్నీ మీకు ఏం నేర్పించింది అని ఓపల్ ను అడిగారు. దానికి ఆమె నా జీవితంలో ఇది నాకు దొరికిన గొప్ప అవకాశం. మిస్ వరల్డ్ అనేది ఒక గొప్ప బాధ్యత, ఎప్పుడైనా మనం చేసే పనులు మంచివై ఉండాలి. ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నా..మన పిల్లలు, చుట్టూ ఉన్నవాళ్లు లేదా పేరెంట్స్..ఇలా ఎవరైనా మనల్ని చూస్తున్నారు అనేది ముఖ్యం అని ఆమె సమాధానం చెప్పారు. దీనికి జడ్జిలు ఫిదా అయిపోయారు. మిస్ట్ వరల్డ్ టైటిల్ కు ఆమెను ఎంపిక చేశారు. 

Also Read :  ఇరాన్ లో ముగ్గురు ఇండియన్స్ కిడ్నాప్..పాకిస్తాన్ నంబర్ నుంచి డబ్బులు?

 

Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

 

today-latest-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు