Manchu Manoj: ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్‌పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్

కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్‌పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భైరవం’ సక్సెస్ మీట్‌లో ‘కన్నప్ప’ హార్డ్‌ డిస్క్ మీ దగ్గరే ఉందంటగా? అనే ప్రశ్నకు.. ఆ రోజు మీకే ఇచ్చేశానుగా ఏం చేశారు? అని తిరిగి మీడియా వారినే సరదాగా ఆటపట్టించాడు. ఆ వీడియో వైరలవుతోంది.

New Update
manchu manoj sensational comments on kannappa hard disk

manchu manoj sensational comments on kannappa hard disk

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం హార్డ్ డిస్క్‌ ఇటీవల దొంగలించబడిన విషయం తెలిసిందే. అయితే ఈ పనంతా మంచు మనోజ్ దగ్గర పనిచేసిన వారే చేశారని విష్ణు ఇటీవల అన్నాడు. అయితే ఇదే విషయంపై తాజాగా మంచు మనోజ్ సంచలన విషయాలు తెలిపాడు. తాను నటించిన ‘భైరవం’ సినిమా సక్సెస్ మీట్‌లో దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘భైరవం’ ప్రెస్‌ మీట్‌లో ‘కన్నప్ప’ హార్డ్‌ డిస్క్ గురించి మీడియా ప్రతినిధి మనోజ్‌ను అడిగారు. ఆ సినిమా హార్డ్ డిస్క్ మీ దగ్గరే ఉందటగా?.. అని అడిగిన ప్రశ్నకు మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 

Also Read: జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే

kannappa Hard Disk

 Also Read: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో

మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మనోజ్ మాట్లాడుతూ.. మీకే కదా ఆ హార్డ్ డిస్క్ ఇచ్చాను. మీరే కదా ఆ రోజు వచ్చి హార్డ్ డిస్క్ తీసుకున్నారు అని సరదాగా నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం మనోజ్ సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది. అదే సమయంలో మనోజ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఒక సినిమా కోసం చాలా మంది వర్క్ చేస్తారని అన్నాడు. కన్నప్ప సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని తాను కోరుకుంటున్నానని తెలిపాడు.  

Also Read: గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో

మంచు విష్ణు ఆరోపణలు

హార్డ్ డ్రైవ్ దొంగతనం వెనుక తన సోదరుడు మంచు మనోజ్ హస్తం ఉందని మంచు విష్ణు ఆరోపించారు. రఘు, మనోజ్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడని, చరిత కూడా మనోజ్ ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి అని అన్నారు.  45 రోజుల క్రితం హైవ్ స్టూడియోస్ నుంచి వచ్చిన హార్డ్ డ్రైవ్ పార్శిల్‌ను విష్ణు ఇంటి సెక్యూరిటీ తీసుకోకుండా మనోజ్ సిబ్బంది అడ్డుకున్నారని..ఇప్పుడు కూడా ఇది వాళ్ళ పనే అని మంచు విష్ణు అన్నారు. ఇప్పటికే చాలా వివాదాలతో మంచు కుటుంబం రోడ్డు మీదకు వచ్చింది. కాగా ఇప్పడు హార్డ్ డ్రైవ్ గొడవతో ఈ గొడవలు మరింత ముదిరిందని పలువురు అంటున్నారు. 

Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

మరోవైపు మనోజ్ భైరవం ఫంక్షన్ లో మనోజ్ కూడా హార్డ్ డ్రైవ్ గురించి మాట్లాడడం సంచలనం సృష్టించింది.  చరితకు మనోజ్ థాంక్స్ చెప్పారు. ఆమె చాలా గొప్ప పని చేసిందని..జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పారు. తన అన్నకు చరిత చేసిన మేలు మరువరానిది అంటూ మాట్లాడారు. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఆమె గురించే మాట్లాడడంతో మొత్తం హార్డ్ డ్రైవ్ వ్యవహారం అంతా ఆమె చుట్టూతానే తిరుగుతోంది అని తెలుస్తోంది. ఆమెను మధ్యలో పెట్టుకుని అన్నదమ్ముల గొడవ మరింత పెరిగేలా కనిపిస్తోంది.

 

Manchu Vishnu | Bhairavam release date

Advertisment
Advertisment
తాజా కథనాలు