/rtv/media/media_files/2025/04/26/EtWa2LIvGe13OUVbuPiO.jpg)
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. పాకిస్తాన్ హెచ్చరికలకు భారత్ భయపడదని త్రివిధ దళాలు గట్టి కౌంటర్ ఇస్తున్నాయి. పహల్గామ్ దాడితో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణ కమ్ముకొస్తోంది. పాకిస్తాన్ ప్రధాని, మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. భారత్ వాటికి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సైన్యం ద్వారా తెలియజేస్తోంది.
Also read: Pakistan: పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి.. మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్!
In a significant step towards the development of next-generation station hypersonic missiles, India has successfully carried out ground test of the Scramjet engine for more than 1,000 seconds: Government officials pic.twitter.com/5jpoMub7iI
— ANI (@ANI) April 25, 2025
ఈ లాంటి కీలక సమయంలో హైదరాబాద్ DRDOలో స్క్రామ్‌జెట్ ఇంజన్ పరీక్ష విజయవంతమైంది. దీంతో ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి, పాక్‌కు తెలియజేస్తున్నారు. స్క్రామ్‌జెట్ ఇంజన్‌తో నెక్స్ట్ జనరేషన్ హైపర్ సోనిక్ మిసైల్స్ తయారీకి లైన్ క్లియర్ అయ్యింది. స్క్రామ్ జెట్‌కు సుదూర లక్ష్యాలను సులభంగా ఛేదించే సామర్థ్యం ఉంది. హైపర్ సోనిక్ టెక్నాలజీలో భారత్ చరిత్ర సృష్టించబోతుంది. గంటకు 6100 కి.మీ వేగంతో ప్రయాణించ గల సామర్థ్యం పెరుగుతుంది.
Also read: Pakistan: పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి.. మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్!
ఏ క్షణమైనా యుద్ధం రావచ్చని భారత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ కరాచీ సమీపంలోకి చేరుకున్నది. ఈ నేపథ్యంలో పాక్ పరోక్ష హెచ్చరికలు చేసింది. అరేబియా సముద్రంలో ఈరోజు, రేపు తమ నౌకాదళం విన్యాసాలు చేయనుందని, వీటిలో క్షిపణి పరీక్షలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. ఆ సమయంలో నౌకలు, విమానాలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి బదులుగా ఇండియన్ నేవీ కౌంటర్ ఇచ్చింది. ఏ మిషన్‌కైనా నౌకలు సిద్ధంగా ఉన్నాయంటూ భారత నేవీ పోస్ట్ వేయడం గమనార్హం.
Also read: టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్
(hyderabad | jammu kashmir attack | pakistan | action on pakistan | india | latest-telugu-news | Scramjet engine testing)