బిట్టూ నువ్ సూపర్ రా..  క్రికెట్‌పై ఇష్టం రూ.3900 కోట్ల ఆస్తిని కాపాడింది..!

జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఖాళీ స్థలంలో ఓ బాలుడు క్రికెట్ ఆడుకునేవాడు. కొన్నిరోజులుగా అక్కడ కంచె వేసి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ఆ బాలుడు హైడ్రా కమిషనర్‌కు లెటర్ రాశాడు. ఆ చుట్టు పక్కల 39 ఎకరాలు ఆక్రమణకు గురైందని బయటపడింది.

New Update
latter to av ranganath

లంగర్‌హౌజ్‌కు చెందిన ఒక బాలుడు చాలా సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుకునేవాడు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్ అయిపోగానే దగ్గర్లో గ్రౌండ్‌కు వెళ్లి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేవారు. అయితే కొంతకాలంగా ఆ పిల్లలు గ్రౌండ్‌లోకి వెళ్లకుండా కంచె వేసి అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ఆ బాలుడు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు లెటర్ రాసి విషయం చెప్పాడు. బాలుడు రాసిన లేఖపై హైడ్రా కమిషనర్ స్పందించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.

Also read: Husband: బ్యూటీపార్లర్‌కు భార్య, పాపిష్టి మొగుడు.. పాపం బోడిగుండు భార్య

ఆ భూమి ప్రభుత్వానిదని, ప్రస్తుతం అది కోర్టులో వివాదంలో ఉందని అధికారులు గుర్తించారు. బాలుడు ఇచ్చిన సమాచారంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఆ స్థలాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న నిర్మాణాలను ఆపేశారు. నార్నె ఎస్టేట్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ భూమిని ఆక్రమించి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని వెంటనే కూల్చివేతలు మెుదలుపెట్టారు.

Also read: బీజేపీ లీడర్ హత్యకు కుట్ర.. రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయిన సుపారీ గ్యాంగ్

మొత్తం 39 ఎకరాలు కబ్జాకు గురైందని సమాచారం. దాని విలువ రూ.39వేల కోట్లు అట. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ 39 ఎకరాల భూమి ఒక్కో ఎకరం రూ.100 కోట్ల కంటే ఎక్కువ పలుకుతోందని చెప్పారు. అక్కడ ప్లాట్లు వేసి, నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఇలా ఆ బాలుడు క్రికెట్‌పై ఉన్న ఫ్యాషన్‌తో జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో రూ. 3,900 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటానికి కారణమయ్యాడు. ఒక్క లేఖతో రూ.3900 కోట్ల విలువైన భూమిని కాపాడేలా చేసింది. 

(hydra | hyderabad | land encroachment | letter | AV Ranganath | hydra-commissioner | langar house hyderabad incident | langar house incident)

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు