Husband: బ్యూటీపార్లర్‌కు భార్య, పాపిష్టి మొగుడు.. పాపం బోడిగుండు భార్య

భార్య బ్యూటీపార్లర్‌కి వెళ్లిందని భర్త ఆమె జుట్టు కత్తిరించాడు. ఉత్తరప్రదేశ్‌ హర్ధోయ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వైరల్‌ అవుతుంది. భార్య సుమన్ ఫెషియల్, ఐబ్రోస్ చేయించుకుందని కోపంతో రాంప్రసాద్‌ కత్తితో ఆమె జడ కోసేశాడు. అత్తామామలు అతనిపై కేసు పెట్టారు.

New Update
Husband cuts wife hair

అందంగా కనపడాలని చాలామంది ఆడవాళ్లు తపన పడుతుంటారు. అందుకోసం ఫెషియల్, బ్యూటీపార్లర్లు, ఆ క్రీమ్, ఈ క్రీమ్ అంటూ ఏవేవో రాస్తున్నారు. బ్యూటీపార్లల్‌కు వెళ్లిన ఓ మహిళ పరిస్థితి ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిపడినట్లు అయ్యింది. భార్య ఫెషియల్ చేయించుకుందని భర్త ఆమె జుట్టు కత్తిరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్ధోయ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొహల్లా సరాయిముల్లాగంజ్ నివాసి అయిన రాధాకృష్ణ తన కుమార్తె సుమన్‌ను హర్పాల్‌పూర్‌కు చెందిన రాంప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశాడు. తమ కుటుంబసభ్యుల వివాహం ఉన్నదని పుట్టింటికి వచ్చిన సుమన్.. బ్యూటిపార్లల్‌కు వెళ్లి ఫెషియల్ చేయించుకుంది. ఫెషియల్‌తో పాటు ఐబ్రోస్ కూడా చేయించుకుంది. ఆ పెళ్లి వేడుకకు హజరయ్యేందుకు రాంప్రసాద్ అత్తమామల ఇంటికి వెళ్లాడు.

Also read: బీజేపీ లీడర్ హత్యకు కుట్ర.. రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయిన సుపారీ గ్యాంగ్

పోలీసులకు ఫిర్యాదు

భార్య మేకప్ చూసిన ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెతో వాగ్వాదానికి దిగడంతో మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో భర్త రాంప్రసాద్ ఆమెపై దాడి చేయడమే గాక అత్తమామల ముందే భార్య జుట్టును కత్తితో కోసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అల్లుడు అదనపు కట్నం కోసం కూతుర్ని వేధిస్తున్నాడని, కొత్త ఫ్రిడ్జ్, కూలర్ వంటి వస్తువులు డిమాండ్ చేస్తూ.. నిత్యం గొడవ పడేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈక్రమంలోనే తమ కుమార్తెతో కావాలని గొడవకు దిగి ఆమె జడ కత్తిరించాడని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతామని వెల్లడించారు. 

(husband cut wife hair | beauty parlours | husband | viral-video | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు