/rtv/media/media_files/2025/10/04/hydra-2025-10-04-11-29-54.jpg)
హైదరాబాద్(hyderabad)లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా(Hydra) కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. కొండాపూర్(kondapur) లో 36 ఎకరాల్లో నిర్మాణాలను కూల్చివేసింది. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు చేపట్టారు అధికారులు. ప్రభుత్వం లెక్కించిన ప్రకారం, ఈ 36 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ సుమారు రూ. 3,600 కోట్లుగా ఉంది.ఈ పై సుమారు 60 ఏళ్లుగా 12 మంది రైతులు తమ ఆధీనంలో ఉందని వాదిస్తున్నారు. ఈ స్థలం తమదేనంటూ రైతులు, ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా న్యాయపరమైన వివాదం నడుస్తోంది.
Also Read : ప్రేమించి పెళ్లి.. వారం రోజులకే దూలానికి ఉరేసుకుని యువతి సూసైడ్!
భారీ పోలీసు బందోబస్తు మధ్య
కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమిని 1961లో లావణి పట్టాల ద్వారా తమకు తాత్కాలికంగా కేటాయించారని, తమ పేర్లపై మ్యుటేషన్ చేయాలని కోర్టులను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చినా, ఆ తర్వాత హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు ఆధారంగానే హైడ్రా అధికారులు కూల్చివేతలను చేపట్టారు. హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలను నిర్వహించారు. మీడియాను, స్థానికులను కూడా కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతానికి అనుమతించలేదు.
#Hyderabad---
— Newsmeter Telugu (@NewsmeterTelugu) October 4, 2025
కొండాపూర్‌లో ఆక్రమణలను తొలగించి రూ.3,600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. సర్వే నం. 59 లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమ ఆక్రమణదారుల నుండి శనివారం హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. pic.twitter.com/sriyXqA0qO
ప్రభుత్వ ఆస్తుల రక్షణలో భాగంగా, కోర్టు తీర్పుల అనంతరం హైడ్రా అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. స్థానికులు మాత్రం తమ ఆక్రమణలు కాదని, తమ భూమిని కాపాడుతూ వచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు మేరకు ఆక్రమణలు తొలగింపును చేపట్టామన్న హైడ్రా అధికారులు.. తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేసిన వారిని ఖాళీ చేయించారు. కూల్చివేతలు పూర్తయిన తర్వాత, అధికారులు ఆ స్థలం చుట్టూ కంచె వేసి, ప్రభుత్వ భూమి అని సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ చర్య ద్వారా రూ. 3,600 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతం కాకుండా కాపాడినట్లయింది.
రూ.3,600 కోట్ల విలువైన సర్కారు భూమిని కాపాడిన హైడ్రా
— Aapanna Hastham (@AapannaHastham) October 4, 2025
-కొండాపూర్‌లో సర్వే నెంబర్ 56లో 36 ఎకరాల సర్కారు భూమి కబ్జా
-ప్రభుత్వ భూమిలో షెడ్లు నిర్మించి వ్యాపారం చేస్తున్న అక్రమార్కులు
-ఆక్రమణలు తొలగించి, ప్రభుత్వ భూమి చుట్టూ కంచె వేసిన హైడ్రా
ప్రభుత్వ భూముల జోలికొస్తే..
ఎవ్వడైనా సరే… pic.twitter.com/hRgLKGT4g1
Also Read : వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తా.. ప్రశాంత్ కిషోర్ వార్నింగ్
గత నెలలో గాజులరామారం డివిజన్‌లోని సర్వే నెంబర్ 307 లో సుమారు 275 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ నెల (అక్టోబరు)లో మళ్లీ భారీ స్థాయిలో కూల్చివేతలు చేపడతామని గతంలోనే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కబ్జా స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారిలో ఆందోళన నెలకొంది. నగరంలో వరద సంక్షోభాన్ని పరిష్కరించడానికి చెరువుల పునరుద్ధరణ అనేది అత్యంత ప్రభావవంతమైన దీర్ఘకాలిక వ్యూహమని హైడ్రా కమీషనర్ ఏ.వి. రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ 2047 రోడ్‌మ్యాప్‌లో చెరువుల పునరుజ్జీవనం కీలకం అని ఆయన పేర్కొన్నారు.