/rtv/media/media_files/2024/10/30/UpUkx4fW72k9096Bj33Z.jpg)
Hydra Cheap AV Ranganath
Hydra: చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంతో పాటు.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అండగా నిలబడి సహాయ సహకారాలు అందించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఇప్పుడు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించడానికి సిద్ధమైంది. ఇందుకు ప్రతి సోమవారాన్ని( ప్రభుత్వ సెలవులు మినహాయించి)కేటాయించింది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు ఇలా ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేసే క్రమంలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
రాణిగంజ్‌లోని బుద్ధభవన్‌లో
ప్రజల నుంచి ఫిర్యాదులతో పాటు సలహాలను స్వీకరించడానికి ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, తిరిగి 3.00 గంటల నుంచి 5.30 గంటల వరకూ రాణిగంజ్‌లోని బుద్ధభవన్‌లో ఉంటుందన్నారు. ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలు తీసుకుని కార్యాయానికి రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఏమైనా సందేహాలుంటే 040 - 29565758, 29560596 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఇది కూడా చదవండి: Hydra Jobs: హైడ్రాలో 970 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!
హైడ్రాలో 970 ఉద్యోగాలు..
ఇదిలా ఉంటే.. తెలంగాణ నిరుద్యోగులకు హైడ్రా గుడ్ న్యూస్ చెప్పింది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన హైడ్రాలో 970 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 203 మంది మేనేజర్లు, 767 మంది అసిస్టెంట్లను నియమించనున్నట్లు తెలిపారు. అర్హతలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను 7 ప్యాకేజీలుగా విభజించనున్నారు. 2 మేనేజర్లకు, 5 అసిస్టెంట్లకు ప్యాకేజీలుండనున్నాయి. ఇక ఉద్యోగుల జీతాలు ఒక యేడాదికి రూ.31.70 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని హైడ్రా అధికారులు అంచనా వేస్తున్నారు. మేనేజర్లకు నెలకు రూ.22,750, అసిస్టెంట్లకు రూ.19,500 ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగాలు చేపట్టిన అనంతరం అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించాలి. హైదరాబాద్ పరిధిలోని ఖాళీ స్థలాలు, నీటి వనరులు, పార్కులు, లే అవుట్, ప్రభుత్వ భూములు, ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నాలాలను రక్షణకు చర్యలు చేపట్టాలి.
ఇది కూడా చదవండి: Jaiswal: టెస్టుల్లో జైస్వాల్ సరికొత్త రికార్డు.. భారత తొలి బ్యాటర్!
Follow Us