Ind Vs Aus: టెస్టుల్లో యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. తొలి బ్యాటర్ గా ఘనత!టెస్టు క్రికెట్‌లో భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 5వ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లోనే జైస్వాల్ నాలుగు బౌండరీలు బాదేశాడు. దీంతో ఫస్ట్ ఓవర్‌లో అత్యధిక రన్స్ (16) కొట్టిన భారత బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఇది కూడా చదవండి: Devara : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్ స్టార్క్ పై అటాక్.. సిడ్నీ వేదికగా 5వ టెస్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జైస్వాల్.. తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. స్టార్క్ వేసి రెండో బంతికే ఫోర్ కొట్టిన జైస్వాల్.. ఆ తర్వాత వరుసగా మరో మూడు ఫోర్లు కొట్టాడు. దీంతో ఫస్ట్ ఓవర్ లోనే ఇండియా 16 పరుగులు చేసింది. దీంతో టీమ్‌ఇండియాకు మొదటి ఓవర్ నుంచే అదిరిపోయే ఓపెనింగ్ దక్కింది. టెస్టుల్లో మొదటి ఓవర్‌లోనే అత్యధిక రన్స్ కొట్టిన ఇండియా బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. కాసేపు దూకుడుగా ఆడుతున్నట్లు కనిపించిన యశస్విని స్కాట్ బోలాండ్ బౌల్డ్ చేశాడు. 22 పరుగులకు ఔట్ అయిన యశస్వీ ఈ సిరీస్ లో మొత్తం పెర్త్ సెంచరీతో కలిపి ఐదు టెస్టుల్లో 43.44 సగటుతో 391 రన్స్ చేశాడు. మొదటిసారి తన ఆసీస్ పర్యటన ముగించనున్నాడు. Stumps on Day 2 in Sydney.#TeamIndia move to 141/6 in the 2nd innings, lead by 145 runs.Ravindra Jadeja & Washington Sundar at the crease 🤝Scorecard - https://t.co/NFmndHLfxu #AUSvIND pic.twitter.com/4fUHE16iJq — BCCI (@BCCI) January 4, 2025 ఇది కూడా చదవండి: టార్గెట్ కేసీఆర్.. మేడిగడ్డ వ్యవహారంలో ఆ ఇద్దరికి నోటీసులు! అంతేకాదు తొలిసారి ఆసీస్ పర్యటనకు వచ్చిన యశస్వీ.. మొదటి సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అంతకు ముందు సునీల్ గావస్కర్ 450, వీరేంద్ర సెహ్వాగ్ 464 పరుగులు, మురళీ విజయ్ 482 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (8*), వాషింగ్టన్ సుందర్ (6*) క్రీజులో ఉన్నారు. భారత్ 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.