/rtv/media/media_files/2025/09/20/shiridi-2025-09-20-15-38-01.jpg)
తక్కువ టైమ్ లో, తక్కువ బడ్జెట్ తో ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేయాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ(IRCTC) అదిరిపోయే ప్యాకేజీతో ముందుకు వచ్చింది. కేవలం 2 రోజుల్లో 5 వేల రూపాయలతో షిర్డీ యాత్ర టూర్(Shirdi Yatra Tour) కు వెళ్లవచ్చు. హైదరాబాద్ నుండి 'సాయి సన్నిధి' అనే టూర్ ప్యాకేజీ ఉంది. దీని ధర సుమారు రూ. 4,960 నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, బస, ఒక రోజు బ్రేక్‌ఫాస్ట్, షిర్డీ, శనిసింగ్నాపూర్ దర్శనాలకు రవాణా సదుపాయం కల్పించబడింది. ఈ ట్రిప్‌కు సెప్టెంబర్ 24 నుంచి నవంబర్ 12 వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రతి బుధవారం కాచిగూడ నుంచి సాయంత్రం 6.40 గంటలకు 17064 రైలు (అజంతా ఎక్స్‌ప్రెస్) స్టార్ట్ అవుతుంది. బాసర, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నిజామాబాద్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. కంఫర్ట్, స్టాండర్డ్ పేరిట రెండు రకాల ప్యాకేజీలు ఉంటాయి. కంఫర్ట్ ఎంచుకున్న వారికి థర్డ్ ఏసీలో ప్రయాణం, స్టాండర్డ్ ఎంచుకున్న వారికి స్లీపర్ క్లాస్‌లో బెర్త్ కేటాయిస్తారు. మర్నాడు అంటే గురువారం ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వేస్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఆర్‌సీటీసీ సిబ్బంది షిర్డీలో ముందుగానే ఏర్పాటు చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ దర్శనం టికెట్ సొంతంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
దర్శనం అయిపోయాక సాయంత్రం 5 గంటలక హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాల్సిఉంటుంది. తిరిగు ప్రయాణం కోసం నాగర్‌సోల్ స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 8.30 గంటలకు 17063 రైలు ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మూడో రోజు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ రైలు ఆగుతుంది. దీంతో ఈ యాత్ర ముగుస్తుంది.
Also Read : చావు పిలుస్తోందంటూ చెరువులో దూకిన భర్త...భర్తతో పాటే తానంటూ భార్య..
ప్యాకేజీలో ఏముంటాయి?
ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైలులో 3 ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం
ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం
షిర్డీలో ఉండడానికి వసతి, ఉదయం టిఫిన్ ఫ్రీ
యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్
టోల్, పార్కింగ్ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో భాగమే
లంచ్, డిన్నర్ వంటివన్నీ యాత్రికులే చూసుకోవాలి.
మరింత సమాచారం కోసం, ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read : మీకంటే మృగాలు నయంరా..సంచలన హత్యలు..భార్యలను చంపిన భర్తలు