Hyderabad : మూట ముట్టుకోవద్దు రా మూర్ఖుడా...  హైదరాబాద్లో ఇంద్ర సీన్ రిపీట్..రూ.10కోట్లు టోకరా

హైదరాబాద్‌లో దొంగబాబాలు రెచ్చిపోయారు.  బంజారాహిల్స్‌లో ఇటీవల జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. భస్మంతో బంగారం చేస్తామంటూ దొంగ స్వామీజీల గోపాల్‌ సింగ్ అనే వ్యక్తిని బురిడీ కొట్టించారు.

New Update
gold

చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమా గుర్తుందా.. అందులో ఏవీఎస్ తన ఫ్యామిలీతో కలిసి తెనాలి నుంచి కాశీకి వస్తాడు. అతని భార్య దగ్గర ఉన్న బంగారాన్ని కొట్టేయాలని బ్రహ్మానందం అతని గ్యాంగ్ ప్లాన్ చేస్తారు. అక్కడ గంగా నదిలో ఏం వేసిన అది రెండుగా మారుతాయని చెప్పి నమ్మించి  వారి దగ్గరున్న బంగారాన్ని ఓ మూటలో కట్టి  నదిలో ముంచి పూజలు చేస్తారు. పూజులు చేస్తుండగానే ఏవీఎస్ ఆ మూటను తెరవగా అందులో ఇనుప ముక్కలు కనిపిస్తాయి. సరిగ్గా ఇలాంటి సీన్ హైదరాబాద్ లోనూ జరిగింది.

బంజారాహిల్స్‌లో ఘరానా మోసం

హైదరాబాద్‌(Hyderabad) లో దొంగబాబాలు రెచ్చిపోయారు.  బంజారాహిల్స్‌లో ఇటీవల జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. భస్మంతో బంగారం చేస్తామంటూ దొంగ స్వామీజీలు..   గోపాల్‌ సింగ్ అనే వ్యక్తిని బురిడీ కొట్టించారు.  నెలరోజుల క్రితం ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ కారులో నలుగురు వ్యక్తులు స్వామీజీల వేషధారణలో వచ్చారు. రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న గోపాల్‌సింగ్‌తో వాళ్లు మాటలు కలిపారు. నీవు విపరీతమైన కష్టాల్లో ఉన్నావని, హిమాలయాల్లో దొరికే కొన్ని మూలికలకు సంబంధించిన భస్మాన్ని ఉపయోగించి పూజలు చేస్తే బంగారం తయారవుతుందని బాగా నమ్మించారు. 

Also Read :  ఇంత దారుణమా?.. షాకింగ్ వీడియో బయటపెట్టిన కవిత!

రూ. 10 లక్షలు తీసుకుని 

వారి మాటలను నమ్మిన గోపాల్ వారిచ్చి భస్మాన్ని తీసుకుని రూ. 10 లక్షలు తీసుకున్నారు. వనమూలికల భస్మానికి నెలరోజుల పాటు పూజలు చేయాలని చెప్పి డబ్బులు తీసుకుని  వెళ్లిపోయారు. ఎరుపురంగు బట్టలో 2 కేజీల బంగారం ఉందని బాధితుడికి ఇచ్చిన స్వామీజీలు.. వారం రోజుల పాటు పూజలు చేసిన తర్వాత తెరవాలని సూచించారు. గోపాల్‌ సింగ్‌కు అనుమానం రావడంతో ఐదు రోజులకే తీసి చూడగా అందులో బంగారం రంగుతో ఇనుప ముక్కలు కనిపించాయి. దీంతో మోసపోయానని భావించి  పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  ప్రధాన నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

Also Read :  నా మంత్రి పదవికి అడ్డంకి వాళ్లే.. కోమటిరెడ్డి మరో సంచలన ట్వీట్!

భస్మాల పేరుతో మోసం

కాగా ఇదే రీతిలో నాగోల్‌లో సైతం మహాలక్ష్మి ఆయుర్వేదిక్‌ సెంటర్‌ పేరుతో కేంద్రాన్ని నిర్వహిస్తూ భస్మాల పేరుతో మోసం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడ పనిచేస్తున్న మహేష్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  వీరంతా మహారాష్ట్రలోని నాగపూర్‌ ప్రాంతానికి చెందినవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా పలువురిని మోసం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Also read : మొన్న కుక్కకి, నిన్న ట్రంప్‌కు, ఈరోజు పిల్లికి.. అసలు బిహార్‌లో ఏం జరుగుతోంది?

Advertisment
తాజా కథనాలు