/rtv/media/media_files/2025/08/11/komatireddy-raj-gopal-reddy-2025-08-11-13-26-00.jpg)
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్యనేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్నారన్నారు. ఈ వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన భట్టికి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, , అవినీతి రహిత పాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమ… pic.twitter.com/1Ba3yO1F8L
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) August 11, 2025
తనకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ విషయమై ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. మరో పదేళ్లు తానే సీఎం అంటూ రేవంత్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించగా.. కాంగ్రెస్ లో ఇది కూదరదంటూ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా జర్నలిస్ట్ లపై రేవంత్ ఫైర్ అయితే.. ఇది పద్ధతి కాదంటూ X ఖాతాలో పోస్ట్ చేశారు. తాజాగా కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. రాజగోపాల్ కు మంత్రి పదవి హామీ ఇచ్చే సమయంలో తాను కూడా ఉన్నానని అన్నారు. సమీకరణాల కూర్పు నేపథ్యంలో కుదరలేదన్నారు.