/rtv/media/media_files/2025/09/06/ganesh-2025-09-06-06-51-59.jpg)
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్దమైంది. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ తో పాటుగా సిటీలోని 20 ప్రధాన చెరువులు, 72 బేబీ పాండ్స్ లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆదివారం చంద్రగ్రహాణం కారణంగా శనివారం అర్థరాత్రిలోపే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.
Also Read : నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం...కవిత పేరు ప్రస్థావించకుండానే హరీష్ రావు కౌంటర్
శోభాయాత్రకు రూట్లు ఇవే!
హైదరాబాద్ కమిషన రేట్ పరిధిలో బాలాపూర్ వద్ద గుర్రం చెరువు లోని కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ప్రవేశించి, కేశవగిరి- చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ - ఎంబీ ఎస్ఆర్ క్రాస్ రోడ్ - ఫలక్నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి - అలియాబాద్ నాగులచింత చార్మినార్ -మదీనా - అఫ్టల్ గంజ్ -ఎస్ఏ బజార్ - ఎంజే మార్కెట్ - అబిడ్స్ క్రాస్ రోడ్ - బషీర్ బాగ్ - 9 లిబర్టీ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ మార్గ్ -నెక్లెస్ రోడ్ వరకు చేరుకుంటుంది.
సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర సంగీత్ థియేటర్ - ప్యాట్నీ - ప్యారడైజ్ జంక్షన్ - ఎంజీ రోడ్-రాణిగంజ్ కర్బలా మైదాన్ - సోనాబాయి మసీదు - ట్యాంక్ బండ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటుంది. చిలకల గూడ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ హాస్పిటల్ - ఆర్టీసీ క్రాస్ రోడ్ - నారాయణగూడ -క్రాస్ రోడ్ - హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీ జంక్షన్ వద్ద ప్రధాన శోభా యాత్రలో కలుస్తాయి.
ఈస్ట్ జోన్, ఉప్పల్ ప్రాంతం నుంచి వచ్చే శోభా యాత్ర రామంతాపూర్ - శ్రీ రమణ జంక్షన్ - ఛే నంబర్ జంక్షన్- తిలక్ నగర్ - శివం రోడ్ - ఓయూ ఎన్సీసీ - విద్యా నగర్ టీ జంక్షన్ - హిందీ మహావిద్యాలయ క్రాస్ రోడ్స్-ఫీవర్ హాస్పిటల్ - టీపై మండలి బర్కతురా క్రాస్ రోడ్స్ - వైఎంసీఏ నుంచి నారాయణగూడ క్రాస్ రోడ్స్ చేరుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే శోభాయాత్రలో చేరతాయి.
దిల్ సుఖ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలు ఐఎస్ సదన్ - సైదాబాద్ - చంచల్గూడ వద్ద నల్గొండ క్రాస్ రోడ్స్ శోభాయాత్రలో చేరతాయి. పెద్ద విగ్రహాలు మూసారాంబాగ్ నుంచి అంబర్పే ట్ వైపు సాగుతాయి. తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా వర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకే షన్ రోడ్, అడిక్మెట్ నుంచి విద్యా నగర్ ద్వారా ఫీవర్ హాస్పిటల్ వద్ద శోభాయాత్రలో చేరతాయి.
టోలీచౌకి రేతిబౌలి, మెహదీపట్నం వైపు నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్ -అయోధ్య జంక్షన్ - నిరంకారిభవన్ - ద్వారకా హోటల్ జంక్షన్ - ఇక్బాల్ మినార్ న్నుంచి ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. ఇక ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్ఆర్ నగర్- అమీర్పేట్ - పంజాగుట్ట- ఖైరతాబాద్ నుంచి మెహిదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్రలో నిరంకారీ భవన్ వద్ద చేరి ఎన్టీఆర్ మార్గ్ -నెక్లెస్ రోడ్ వైపు సాగుతాయి.
టప్పా ఛబుత్రా, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్ బోయిగూడ కమాన్ - వోల్గా హోటల్ క్రాస్ రోడ్స్ అఘపుర సిండికేట్ బ్యాంక్ గోషామహల్ బరదారి - అలస్కా - మలకుంట జంక్షన్ నుంచి ఎంజే మార్కెట్ వద్ద ప్రధాన శోభాయాత్రలో చేరతాయి.
Also Read : కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!