/rtv/media/media_files/2025/12/27/fotojet-23-2025-12-27-21-36-01.jpg)
Serious road accident in Sangareddy
Road accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కంది వద్ద NH 65పై ఆగి ఉన్న టిప్పర్ ను ఆర్టీసీ బస్సుఢీ కొట్టింది. మెదక్ నుంచి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో కరెంట్ లేకపోవడంతో క్షతగాత్రులకు చికిత్స అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రమాదానికి ముందు ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీ కొట్టినట్లు వారు చెబుతున్నారు. ప్రమాదానికి అరగంట ముందే శివంపేట వద్ద స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని ప్రయాణికులు చెబుతున్నారు.
కాగా ప్రమాదంలో ప్రయాణీకులు స్వల్పగాయలతో బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కరెంట్ లేకపోవడంతో సిటీ స్కాన్ కోసం అరగంటకు పైగా క్షతగాత్రులు ఎదురుచూపులు చూడాల్చి వచ్చింది. కాగా ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్ డ్రైవర్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
Follow Us