కొరటాల శివ నెక్స్ట్ సినిమాకు భారీ ప్లాన్.. మలయాళ స్టార్ హీరో కొడుకుతో..

డైరెక్టర్ కొరటాల శివ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణవ్ 'హృద‌యం'తో హీరోగా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు.

New Update
koratala siva

Koratala Siva

Koratala Siva:  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ 'మిర్చి', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'జనతా గ్యారేజ్' బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ 'దేవర' మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం దేవర 'పార్ట్ 2 ' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 

మోహన్ లాల్ కొడుకుతో కొరటాల శివ 

ఇది ఇలా ఉంటే.. కొరటాల శివ నెక్స్ట్ చేయబోయే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. శివ తన నెక్స్ట్ సినిమాను మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ తో  ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రణవ్ 2022లో విడుదలైన  మలయాళ చిత్రం 'హృదయం' సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.  ఈ సినిమా యూత్ లో ప్రణవ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను అమాంతం పెంచేసింది. ఈ ఏడాది 'వర్షంగళ్కు శేషం' తో మరో హిట్ అందుకున్నాడు. దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  మోహన్ లాల్ కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా చేశారు.

Also Read:బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. నిఖిల్ చేసిన పనికి యష్మీ ఎలిమినేటెడ్..!

pranav

ప్రణవ్ చిన్నవయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు.  2003లో 'పునర్జని' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రణవ్ నటనకు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు లభించింది. 'ఆది' చిత్రానికి  బెస్ట్ డెబ్యూ  యాక్టర్ గా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును పొందాడు. 

Advertisment
తాజా కథనాలు