/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-66-1.jpg)
Hyderabad Housing Sales: హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్ ఢమాల్ అయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్లు కొనేవారి సంఖ్య భారీ తగ్గింది. ఇండియా మొత్తం మీద 2024లో 5 లక్షల యూనిట్ల నుంచి 4.70 లక్షలకు హౌసింగ్ సేల్స్ పడిపోయాయి. ఢిల్లీ(Delhi), నవీ ముంబై(Mumbai) నగరాల్లో మాత్రమే ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. టాప్ 9 సిటీల్లో ఇండ్ల కొనుగోలు అమ్మకాలు 9 శాతం తగ్గాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ దేశవ్యాప్తంగా హౌసింగ్ సేల్స్ రిపోర్ట్ ఇచ్చింది.
Also Read: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!
2023లో అమ్మిన ఇండ్ల సంఖ్య 5.14 లక్షలు కాగా.. 2023లో లాంచ్ చేసిన ఇండ్లు 4.81 లక్షలు అట. ఇండియాలోని 9 నగరాల్లో రెండు నగరాల్లో మాత్రమే హౌసింగ్ సేల్స్ పెరిగాయని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. 2024లో అత్యధిక ఇండ్లు నవీ ముంబైలో అమ్ముడుపోతే.. అతి తక్కువ ఇండ్లు హైదరాబాద్‌లో సేల్ అయ్యాయి. 2024లో ముంబై గృహ విక్రయాలు 16 శాతం పెరిగి 33వేల ఇళ్లు సేల్ అయ్యాయి. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో 5 శాతం పెరిగి 43 ఇళ్లు అమ్ముడు పోయాయి.
Also Read: ప్రభుత్వం గుడ్ న్యూస్.. విప్రోలో 5000 ఉద్యోగాలు
ఎవరు కొంటలేరు..
బెంగళూరు(Benguluru), చెన్నై(Chennai), హైదరాబాద్, కోల్‌కతా(Kolkata), థానే, పూణే నగరాల్లో ఇళ్ల అమ్మాకాలు తగ్గిపోయాయి. 2023 పీక్ ఇయర్ కావడంతో 2024లో హౌసింగ్ సప్లై, సేల్స్ తగ్గడానికి మొదటి కారణం. అయితే 2024లో సరఫరా-డిమాండ్ నిష్పత్తి 2023లో మాదిరిగానే ఉందని ప్రాప్ ఈక్విటీ సీఈవో, వ్యవస్థాపకుడు సమీర్ జసుజా అన్నారు. అక్టోబర్- డిసెంబర్ సమయంలో హైదరాబాద్ నగరంలో హౌసింగ్ సేల్స్ ఏకంగా 36 శాతం పడిపోయినట్లు ఇటీవల స్థిరాస్తి కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ రిపోర్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్- డిసెంబరులో 20,491 ఇళ్లు అమ్ముడవగా.. గతేడాది చివరి 3 నెల్లలో ఇది 13,179 ఇళ్లు మాత్రమే అమ్ముడు పోయాయని తేలింది.
Also Read: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
Also Read : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!