Leopard: హైదరాబాద్‌లో సంచరిస్తున్న చిరుత బందీ

హైదరాబాద్‌లో సంచరిస్తున్న చిరుత గురువారం ఉదయం ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది. మెయినాబాద్‌ ఎకోటిక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. చిరుతను నల్లమల్ల అడవులకు తరలించనున్నారు. పట్టుకోడానికి 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు ఏర్పాటు చేశారు.

New Update
leopad

హైదరాబాద్‌‌లో సంచరిస్తున్న చిరుతని ఫారెస్ట్ అధికారులు గురువారం బందీ చేశారు. గోల్కొండ ప్రాంతంలో ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు  సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 12 రోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో  చిరుత సంచరిస్తోంది. పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటూ తిరుగుతున్నారు. మంచిరేవుల ఫారెస్ట్‌ టెక్‌ పార్కులో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడింది. దీంతో దానిని అధికారులు జూపార్క్ తీసుకెళ్లి.. అక్కడి నుంచి నల్లమల్ల అడవులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్ల మల్ల అడవుల్లో దాన్ని వదిలేయనున్నారు.

Also Read :  పార్టీ ఫిరాయించిన MLAలకు 3 నెలలే డెడ్‌లైన్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

Leopard In Hyderabad

గ్రేహౌండ్స్‌ ప్రాంతంలో 4 బోన్లు, 8 ట్రాప్‌ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయినా గతకొన్ని రోజులగా చిరుత తప్పించుకుంటూ తిరుగుతోంది. గురువారం ఉదయం ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది. మెయినాబాద్‌ ఎకోటిక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. చిరుతను నల్లమల్ల అడవులకు తరలించనున్నారు. చిరుతను పట్టుకోడానికి 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ని రోజుల నుంచి చిరుత ఎప్పుడు, ఎవరిపై దాడి చేస్తోందని భయంతో బతికారు.

బోనులో పడ్డ చిరుత ఘాండ్రిస్తూ వీడియోలు తీస్తున్న వారిపైకి ఎగబడుతుంది. చిరుత చాలా ఆవేశంగాా కనిపిస్తోంది. చిలుకూరి జింకల పార్క్, గ్రేహౌండ్స్‌ క్యాంపస్‌, పోలీస్‌ అకాడమీ, గోల్కొండ మిలటరీ కేంద్రం, మంచిరేవుల అటవీ ప్రాంతం అన్నీ కలిపి సుమారు 20 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం అటవీ వాతావరణాన్ని పోలి ఉండడంతో చిరుత స్వేచ్ఛగా సంచరిస్తున్నది. ఈ క్రమంలో గత గురువారం తెల్లవారుజామున చిరుత పులిని చూసినట్లు గ్రేహౌండ్స్‌ క్యాంపు సమీపంలో చూసినట్లు పోలీసులు కానిస్టేబుళ్లు వెల్లడించారు. అది సంచరిస్తున్న ప్రాంతాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Also Read :  తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డా... అనాథగా శిశు విహార్‌ల్లో రెండు నెలల పసికందు

leopard visuals | latest-telugu-news | Viral News | latest telangana news

Advertisment
తాజా కథనాలు