హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రాణాలు నిలిపే తిండే అవే ప్రాణాలను తీసింది. సికింద్రాబాద్‌లో ఓ ప్రవైట్ స్కూల్లో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. గొంతులో ఎముకలు, ముళ్ళు ఇరుక్కుని చనిపోయిన వారి గురించి ఇంతకు ముందు విన్నాం. కానీ ఇప్పుడు చపాతీ రూల్ గొంతులో ఉండిపోయిన ఓ ఆరో తరగతి పిల్లాడు చనిపోయాడు. సికింద్రాబాద్ పరిధిలోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో విరన్ జైన్ అనే విద్యార్థి ఆరవ తరగతి చదవుతున్నాడు. రోజు మాదిరిగా విరన్ జైన్ ఈరోజు స్కూల్కు వెళ్లాడు. లంచ్ బ్రేక్ లో ఇంటి నుండి తెచ్చుకున్న చపాతి తింటున్నాడు. ఈ క్రమంలో చపాతి విరన్ జైన్ గొంతులో ఇరుక్కుపోయింది.
ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే..
విరన్ గొంతులో చపాతీ ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్ధులు వెంటనే అప్రమత్తమై స్కూల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడిని సిబ్బంది తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే పరిస్థితి విషమించి విరన్ జైన్ మరణించాడు. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది విద్యార్థి కుటుంబ సభ్యులకు తెలిపారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న విరన్ జైన్ ఫ్యామిలీ మెంబర్స్.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: IPL 2025: రెండో రోజు మెగా వేలంలో బౌలర్లకు జాక్ పాట్..
Also Read : 🔴IPL Auction Day -2: ఐపీఎల్ మెగా వేలం.. లైవ్ అప్డేట్స్!