ల్యాండ్‌మైన్స్‌ ఉత్పత్తిపై నిషేధం.. ఐరాస చీఫ్‌ కీలక ప్రకటన!

ప్రపంచవ్వాప్తంగా ల్యాండ్‌మైన్స్‌ ఉత్పత్తి పెరిగిపోతుండటంపై ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా యాంటీపర్సనల్‌ ల్యాండ్‌మైన్స్‌ ఉత్పత్తి, వినియోగం నిలిపేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

New Update
rere

Antonio Guterres: ప్రపంచవ్వాప్తంగా ల్యాండ్‌మైన్స్‌ ఉత్పత్తి పెరిగిపోతుండటంపై ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మందుపాతరల వినియోగం పెరగటం మానవాళి భాగీ నష్టపోతుందని, వీలైనంత త్వరగా యాంటీపర్సనల్‌ ల్యాండ్‌మైన్స్‌ ఉత్పత్తి, వినియోగం నిలిపేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంబోడియాలో సోమవారం జరిగిన సదస్సులో ఒట్టావా అగ్రిమెంట్ అమలు చేయని కొన్ని దేశాల వల్ల మరింత ముప్పు పెరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా గతేడాది మందుపాతరల వల్లే ప్రపంచవ్యాప్తంగా 5757 మంది చనిపోయినట్లు ‘ల్యాండ్‌మైన్‌ మానిటర్‌’ నివేదిక పేర్కొంది. 

తర్వాతి తరాలకు భయాందోళన..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ల్యాండ్ మైన్ భారీగా వినియోగిస్తున్నారు. పుతిన్‌ సైన్యం వీటిని భారీగా ఉపయోగిస్తుండగా ఉక్రెయిన్‌కు యాంటీపర్సనల్‌ ల్యాండ్‌మైన్స్‌ను ఇవ్వాలని అమెరికా నిర్ణచడం దారుణం. వీటిద్వారా పౌరులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ఘర్షణలు ముగిసినప్పటికీ ఈ ఆయుధాల ముప్పు తర్వాతి తరాలను భయాందోళనలకు గురిచేస్తాయి. రష్యా, మయన్మార్‌, ఇరాన్‌, ఉత్తర కొరియా దేశాల్లో మందుపాతరల వినియోగం కొనసాగుతోంది. వీటితోపాటు కాంబోడియా, భారత్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌, గాజాలోనూ వీటిని వినియోగించడం ఆందోళన కలిగించే అశంమని గుటెరస్ అన్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు