IPL 2025: రెండో రోజు మెగా వేలంలో బౌలర్లకు జాక్ పాట్.. మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఇప్పుడు రెండో రోజు వేలంలో బౌలర్లు జాక్ పాట్ కొట్టారు. అందరి కంటే ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ రూ. 10.75 కోట్లకు అమ్ముడు పోయాడు. By Manogna alamuru 25 Nov 2024 | నవీకరించబడింది పై 25 Nov 2024 19:32 IST in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఐపీఎల్ మెగా వేలంలో అన్ని టీమ్‌ల యజమానులు బౌలర్లను కొనడానికి ఆసక్తిని చూపించారు. పెద్ద మొత్తాలను వెచ్చించి మరీ బౌలర్లను తమ టీమ్‌లలోకి తీసుకున్నారు. లక్కీ భువనేశ్వర్.. అందరికంటే ఎక్కువగా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఎక్కువ ధరకు బిడ్ అయ్యాడు. ఇతనిని ఆర్సీబీ రూ. 10.75 కోట్లు ఇచ్చి కొనుక్కుంది. ఇంతకు ముందు భువి హైదరాబాద్‌కు ఆడాడు. అయితే ఈ వేలంలో మాత్రం భువనేశ్వర్‌ను ఆర్టీఎం ద్వారా తీసుకునేందుకు ఎస్ఆర్‌హెచ్ ఇంట్రస్ట్ చూపించలేదు. దీంతో.. ఈ సీజన్‌లో భువీ బెంగళూరుకు ఆడనున్నాడు. గతంలో 4.2 కోట్లకు సన్ రైజర్స్ తీసుకోగా.. ఆర్సీబీ ఈసారి రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. Also Read: Bit Coin : మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే.. అలాగే లాస్ట్ సీజన్‌లో సీఎస్కేకు ఆడిన తుషార్ దేశ్ పాండేని ఈసారి రాజస్థాన్ కొనుగోలు చేసింది. తుషార్ దేశ్ పాండేను రూ. 6.50 కోట్లకు ఆర్ఆర్ తీసుకుంది. ఇతని బేస్ ప్రైస్ రూ. కోటి.. కాగా.. సీఎస్కే, రాజస్థాన్ పోటీ పడ్డాయి. మరోవైపు.. ఆర్టీఎం ద్వారా ముఖేష్ కుమార్ రూ.8 కోట్ల ధర పలికాడు. పేసర్ ముఖేష్ కుమార్ కోసం సీఎస్కే, పంజాబ్, ఢిల్లీ మధ్య వేలం జరిగింది. ఇక దీపక్ చాహర్‌ను ముంబై భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ. 9.25 కోట్లకు ముబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. చాహర్ కోసం చెన్నై, ముంబై మధ్య పోటీ సాగింది. యువ బౌలర్ ఆకాశ్ దీప్‌ను కూడా భారీ ధరకు కొనుగోలు చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ రూ.8 కోట్లకు ఇతనిని సొంతం చేసుకుంది. ఇతని బేస్ ప్రైస్ రూ.కోటి. లక్నో, పంజాబ్ లు ఆకాశ్ దీప్ కోసం పోటీ పడ్డాయి. ఆర్టీఎం ద్వారా అతనిని తీసుకునేందుకు ఆర్సీబీ ఆసక్తి చూపలేదు. Also Read: Iran: ఇజ్రాయెల్ ప్రధానికి మరణశిక్ష విధించాలి–ఇరాన్ సుప్రీం లీడర్. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి