Iran: ఇజ్రాయెల్ ప్రధానికి మరణశిక్ష విధించాలి–ఇరాన్ సుప్రీం లీడర్.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అరెస్ట్ చేస్తే సరిపోదని...ఆయనకు మరణశిక్ష విధించాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ డిమాండ్ చేశారు. రెండేళ్ళల్లో ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. గాజా, లెబనాన్లో ప్రజల జీవితాలను నాశనం చేశారని అన్నారు. 

author-image
By Manogna alamuru
New Update
khameni 2

Iran supreme Leader Khameni: 

ఈ నేరగాళ్లకు మరణ దండన విధించాలి. మన శత్రువు గాజా, లెబనాన్‌లో విజయం సాధించరు. ఈ రెండు చోట్లా ప్రజల ఇళ్లపై బాంబులు వేస్తే విజయం వచ్చినట్టు కాదు. మూర్ఖులు అది ఆలోచించరు. ఎందుకంటే వారు ప్రజల ఇళ్లు, వైద్యశాలలు, కమ్యూనిటీలపై బాంబింగ్‌ చేస్తున్నారు. దానిని ఎవరూ విజయం అనుకోరు అంటూ ఇరాన్ లీడర్ ఖమేనీ వ్యాఖ్యానించారు.  ఇజ్రాయెల్ ప్రధానితో పాటూ మిగతా కొందరు నేతు చేస్తున్నది నేర...దానికి వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు. నెతన్యాహు, రక్షణ మంత్రి గ్యాలెంట్‌కు ఉరిశిక్ష వేయాలని ఖమేనీ డిమాండ్ చేశారు.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మీద ఐసీసీ చర్యలకు సిద్ధమైంది. నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ రక్షణశాఖ మంత్రి యోఆవ్‌ గల్లాంట్‌పైనా ఇవి జారీ అయ్యాయి. గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చర్యల కొనసాగింపు ఆరోపణలపై.. ఈ ఇద్దరిపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు ఎప్పటి నుంచో యుద్ధాన్ని ఆపమని కోరుతున్నాయి. అయినా కూడా ఇజ్రాయెల్ అందరి మాటను పెడచెవిన పెడుతోంది. హమాస్, హెజ్బెల్లాలు అంతమొందించే వరకూ యుద్ధాన్ని ఆపేది లేదని చెబుతోంది. దాని కోసం గాజా, లెబనాన్‌ల మీద అటాక్‌ చేస్తూ వేలమంది ప్రాణాలు తీసింది. 

ఈ క్రమంలో తాము ఐసీసీ అరెస్ట్ వారెంట్‌ను తిరస్కరిస్తుఏన్నామని ఇజ్రాయెల్ చెప్పింది. ప్రపంచ న్యాయస్థానానికి ఇలాంటి ఆర్డర్లు జారీ చేసే హక్కు లేదని అంది. గాజాలో ఎటువంటి యుద్ధనరాలకు పాల్పడలేదని బుకాయించింది. మరోవైపు అమెరికా వైట్ హౌస్‌కు కూడా ఇజ్రాయెల్‌ పక్షాన ఉంటామని ప్రకటించింది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఈ వారెంట్‌ను అమలు చేయమని తేల్చిచెప్పాయి.

Also Read: Bit Coin : మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే..

Advertisment
తాజా కథనాలు