కొత్త సంవత్సరం వేళ అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పి అప్ ట్రక్ జనాలపైకి దూసుకెళ్లడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. లూసియానాలోని న్యూ ఆర్లీన్స్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. న్యూ ఆర్లీన్స్‌లో కెనాల్ అండ్ బోర్డన్ స్ట్రీట్ కూడలిలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఇదే సమయంలో ట్రక్ వేగంగా దూసుకొచ్చింది. ముందు జనాల మీద అడ్డదిడ్డంగా కారు నడపాడు. తరువాత బయటకు వచ్చిన డ్రైవర్ అక్కడి జనసమూహంపై కాల్పులు జరిపాడు. దీంతో 10 మంది మృతి చెందగా.. దాదాపు 30 మంది గాయాలపాలయ్యారు. ఆ తర్వాత పోలీసులు డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఇందులో గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
This is how the driver got on Bourbon Street. This is horrible. Prayers up to all the victims. pic.twitter.com/zFO9p0WsW2
— Nader Mirfiq (@Nader723) January 1, 2025
ఉగ్రవాద చర్యా?
ఈ ఘటనకు పాల్పడిన దుండుగుడు టెక్సాస్ రాష్ట్రానికి చెందిన షంషద్దీన్ జబ్బార్‌గా గుర్తించారు. ఇతను అమెరికా సిటిజెన్. అయితే ఇతను జనం మీదకు ఏ వాహనం అయితే నడిపించాడో అందులో ఐసీ ఉగ్రవాద జెండా కనిపించింది. దీంతో జబ్బార్ ఉగ్రవాది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం జబ్బార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి కారణంగా ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగే స్టేడియాన్ని మూసివేశారు. గాయపడిన వారిని 5 ఆసుపత్రులకు తరలించారు. వారిలో ఇద్దరు ఇజ్రాయెలీలు ఉన్నారు. దుండుగుడు పేలడు పదార్ధాలతో వచ్చినట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను నడిపిన కారులో పేలుడు పదార్ధాలు, ఒక రిమోట్ కంట్రోల్ కూడా దొరికాయి. రక్తపాతం సృష్టించడానికి దుండగుడు చూశాడు. కావాలనే అన్నీ తెలిసే అతను ఈ దాడికి పాల్పడ్డాడు. సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపాలని చూశాడు అని పోలీస్ కమిషనర్ అన్నే కిర్క్‌ప్యాట్రిక్ తెలిపారు. అయితే నిందితుడు ఉగ్రవాది కాకపోవచ్చని ఎఫ్‌బీఐ అధికారి అలెతియా డంకన్ అన్నారు.
🚨#BREAKING: Watch as New surveillance video shows the New Orleans attacker flying down Bourbon Street in New Orleans, causing mass panic with people screaming pic.twitter.com/Cs2SXRMLYz
— R A W S A L E R T S (@rawsalerts) January 1, 2025
అయితే ఈ మొత్తం ఘటనపై అన్ని కోణాల్లో, ఉగ్రవాద కోణంలో కూడా ఎఫ్‌బీఐ ద్యాప్తు చేతుందని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఎటువంటి హింసను అయినా సహించేది లేదని ఆయన అన్నారు.