TGRTC: సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులను ఇబ్బందిపెడితే సహించేది లేదని, బస్సులను సీజ్ చేస్తామని ప్రైవేట్ బస్సుల యజమానులనురాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.అదనపు ఛార్జీల పేరిట ప్రయాణికులను దోపిడీకి గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రెగ్యులర్ ఛార్జీలనే వసూలు చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
Also Read: Delhi: ఢిల్లీని మూసేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం
ప్రైవేట్ బస్సుల యజమానులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఆర్టీసీ అధికారులు రహదారులపైనే ఉండి తనిఖీలు చేపట్టాలి. సంక్రాంతి పండగ నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ 6, 432 ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. అవసరమైతే మరిన్నింటిని నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దంగా ఉండాలన్నారు.
ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేసే ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించినా , సరకు రవాణా చేసినా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లపై చర్యలు తప్పవు.
ఈ విషయమై వారం రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాం.ప్రైవేట్ బస్సుల పై ఇప్పటికే 150 కేసులు నమోదు చేశాం అని వివరంచారు.
ప్రయాణికుల ఆగ్రహం..
టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీల పై నగర ప్రయాణికులు గుర్రుగా ఉన్నారు. సాధారణ ఛార్జీలే అంటూ ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేయగా..టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఛార్జీలే అని స్పష్టమైన ప్రకటన రావడంతో రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, వెళ్లే వారంతా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు.
పండగకు ప్రయాణికులను గమ్యస్థానాకలు చేరవేసేందుకు టీజీఎస్‌ఆర్టీసీ 6,432 బస్సులను నడుపుతుండగా... ఏపీఎస్‌ఆర్టీసీ 7,200 బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. సింహభాగం హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఈ నెల 10,11,12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను సిద్దంగా ఉంచారు.
సాధారణ ఛార్జీలున్న బస్సులు తక్కువగా నడపడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే..ప్రత్యేక బస్సుల్లో 30 నుంచి 50 శాతం అదనపు ఛార్జీలు దర్శనమిస్తున్నాయని ప్రయాణికులు వాపోయారు. విజయవాడకు సూపర్ లగ్జరీ సాధారణ ధర రూ. 440 ఉండగా..స్పెషల్ బస్సులో గరిష్ఠంగా రూ. 660 ఉంది.
విశాఖ పట్టణం. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లోనూ ప్రస్తుత ఛార్జీపై 50 శాతం వరకు టికెట్ ధర పెరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. పండగకు ఊరెళ్లేందుకు నగరవాసులు టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే ఒకట్రెండు సీట్లకు మించి దొరకడం లేదు.
ప్రత్యేక ఛార్జీల వసూళ్లతో జేబులకు చిల్లులు పడుతున్నాయని వాపోయారు. పండగ నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాలకు విమాన ఛార్జీలు ఇంకా పెరిగిపోయాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు విమాన ఛార్జీలు రూ. 14 వేలకు పైగా ఉంది అదే రాజమండ్రికి రూ.22 వేలు ఉంది.
Also Read: Chhattisghar: ఛత్తీస్‌ఘడ్‌లో ఇంకో దారుణం..జర్నలిస్ట్ ఫ్యామిలీ మర్డర్
Also Read: Garikapati : గరికపాటి సంచలన నిర్ణయం... ఆమెపై పరువు నష్టం దావా!