Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)

జమ్మూ కాశ్మీర్‌‌లో పర్యటకులపై ఫైరింగ్ ముందు టెర్రరిస్టులు వారితో మాట్లాడారు. పేరు, మతం అడిగి మహిళ కళ్లముందే ఆమె భర్తని చంపారు. అయితే ఆమెని కూడా చంపమని టెర్రరిస్ట్‌ను అడిగింది. జరిగింది మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలని ఉగ్రవాది అన్నట్లు తెలుస్తోంది.

New Update
Pahalgam attack 123

జమ్మూ కాశ్మీర్ టెర్రర్ అటాక్‌పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్పులు జరిగిన సమయంలో టూరిస్టులతో ఉగ్రవాదులు మాట్లాడారు. పర్యటకులందరినీ తుపాకులతో బెదిరించి మోకాళ్లపై కూర్చోబెట్టారని ప్రత్యేక సాక్షులు మీడియాకు తెలిపారు. టూరిస్టుల పేరు, మతం అడిగి ముస్లింలు కానివారిని కాల్చి చంపారని ప్రత్యేక్ష సాక్షి పల్లవి చెబుతున్నారు. ఆమె భర్త తన పేరు మంజునాథ్ అని చేప్పగానే అతన్ని కాల్చి చంపారని ఆమె తెలిపారు. తనని కూడా చంపమని ఆమె ఉగ్రవాదులను వేడుకుందట. ఇక్కడ జరిగిందంతా మోదీకి చెప్పడానికి నువ్వు బతికే ఉండాలని ఓ టెర్రరిస్ట్ ఆమెతో అన్నాడని తెలుస్తోంది. టెర్రిస్టులు కాల్పులకు ముందు పర్యటకులతో మాట్లాడిని సంభాషణ గురించి సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

Also read: J&K Terror Attack: ‘పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు’

అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌లో మంగళవారం సాయంత్రం టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 30మంది మృతి చెందారు. కాల్పుల్లో మరో 20 మంది గాయపడ్డారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్(TRF) అనే ఉగ్రవాద సంస్థనే దాడి చేసినట్లు ప్రకటించింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్రవాదులు కాల్పులు జరిపారు. ఇండియన్ ఆర్మీ యూనిఫాంలో వచ్చి ఆకస్మాత్తుగా ఫైరింగ్ చేశారని ప్రత్యేక్ష సాక్షులు, క్షతగాత్రులు చెబుతున్నారు.

Also read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు