/rtv/media/media_files/2025/10/23/hyderabad-police-2025-10-23-16-46-52.jpg)
hyderabad police busts prostitution racket banjara hills, Know Details
హైదరాబాద్(hyderabad) లోని బంజారాహిల్స్‌లో ఓ వ్యభిచార ముఠా(prostitusion) గుట్టురట్టయ్యింది. బుధవారం రాత్రి RN హోటల్‌లో పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ విదేశాలకు చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆ విదేశీ అమ్మాయిలతో పాటు నిర్వాహకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బ్యాలెట్తో ఓటింగ్?: ఎలక్షన్ ఆఫీసర్ కీలక ప్రకటన!
Hyderabad Police Busts Prostitution Racket
ఇదిలాఉండగా గతంలో కూడా గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి టీఎన్జీవోస్ కాలనీలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహించారు. ఈ ముఠాను గుట్టును మాదాపూర్ SOT, హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు రట్టు చేశారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ ముఠా వ్యభిచారం చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. అపార్ట్‌మెంటుకు విటులు వచ్చాక టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన లింక్స్‌ను మాయం చేసి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడుతున్నట్లు గుర్తించారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ చెందిన యువతులతో వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Also Read: తెలంగాణలో కొత్త లొల్లి.. మంత్రితో పంచాయితీ.. IAS రాజీనామా?
Follow Us