Miss Telugu USA : మిస్ తెలుగు యూఎస్ఏ రన్నరప్ గా హైదరాబాద్ యువతి

అమెరికా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిస్‌ తెలుగు యూఎస్‌ఏ’ అందాల పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి చూర్ణిక ప్రియా కొత్తపల్లి సత్తా చాటింది. ఈ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన చూర్ణిక, పీపుల్స్ ఛాయిస్ అవార్డును కూడా గెలుచుకుని రెండు కిరీటాలను సొంతం చేసుకుంది.

New Update
 Miss Telugu USA

Miss Telugu USA

అమెరికాలో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిస్‌ తెలుగు యూఎస్‌ఏ’ అందాల పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి, ఏఎస్ రావు నగర్ భవాని నగర్ కాలనీకి చెందిన చూర్ణిక ప్రియా కొత్తపల్లి సత్తా చాటింది. ఈ పోటీల్లో రన్నరప్‌ గా నిలిచిన చూర్ణిక ప్రియా, పీపుల్స్ ఛాయిస్ అవార్డును కూడా గెలుచుకుని రెండు కిరీటాలను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11:30 గంటలకు ఈ విజయం ఖరారైంది. 

Also Read: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

Miss Telugu USA Runnerup Hyderabad Girl

గ్రాండ్‌ ఫినాలే అమెరికాలోని డల్లాస్‌లో ఇర్వింగ్‌ ఆర్ట్‌ సెంటర్‌లో ఈ నెల 25న సాయంత్రం జరిగింది. ఐదు దశల్లో జరిగిన ఫైనల్స్‌లో మిస్ తెలుగు యూఎస్ఏ టైటిల్ రన్నర్ అప్ గా, పీపుల్స్ ఛాయిస్ విభాగంలో 7200 పైగా ఓట్లను సాధించి 1300 ఓట్ల మెజార్టీతో చూర్ణిక ప్రియా అవార్డును సొంతం చేసుకుంది. 2024 లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో గీతం యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన చూర్ణిక ప్రియా కొత్తపల్లి ప్రస్తుతం యూఎస్ఏ లోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా లో కంప్యూటర్ సైన్స్ లో ఎమ్మెస్ చేస్తుంది. చూర్ణిక ప్రముఖ బిల్డర్ కొత్తపల్లి రాంబాబు వనజ దంపతుల రెండో సంతానం. రాంబాబు సొంతగ్రామం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం నడపనవారిపాలెం. కాగా చూర్ణిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది.

ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

చిన్నతనం నుంచి నుంచి ఆటపాటల్లో, చదువులో చురుకుగా ఉండే చూర్ణిక భరతనాట్యంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు మిస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీలో రెండవ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకుంది.  చూర్ణిక ప్రియా ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, తనకు మద్దతునిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఆమె విజయం హైదరాబాద్ నగరానికి, తెలుగువారికి గర్వకారణమని పలువురు అభినందించారు. గత ఐదు నెలలుగా జరుగుతున్న మిస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీల్లో, సుమారు 5000 మంది ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. వివిధ దశల్లో జరిగిన పోటీల్లో చూర్ణిక ప్రియా కొత్తపల్లి విజయం సాధిస్తూ ఫైనల్ లో రెండవస్థానంలో నిలిచింది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి

Also Read :  ట్రంప్ పేరుతో మోసం..కోట్లరూపాయలు యాప్ లో పెట్టుబడులు

 

Breaking Telugu News | ap telugu news | telugu-news | hyderabad-youth | today-news-in-telugu | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు