Woman's Body : ప్రియురాలిని హత్య చేసి బ్లూ డ్రమ్ములో కుక్కిన ప్రియుడు.. ఎందుకంటే?

మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోనూ మీరట్ తరహా ఘటన చోటుచేసుకుంది. డ్రమ్ములో కాళ్లు చేతులు కట్టేసి, కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.

New Update
up lover

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోనూ మీరట్ తరహా ఘటన చోటుచేసుకుంది. డ్రమ్ములో కాళ్లు చేతులు కట్టేసి, కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలిని  దేవాస్ జిల్లాకు చెందిన లక్షిత చౌదరి(22)గా గుర్తించారు. మనోజ్ చౌహాన్‌ అలియాస్‌ మోనుతో లక్షిత ప్రేమలో ఉంది. అయితే  లక్షిత మరో వ్యక్తితో లక్షిత మాట్లాడుతుందన్న అనుమానంతో ఆమెను హత్య(murder) చేశాడు మనోజ్. వైశాలి అవెన్యూ కాలనీలో ఈ ఘటన జరిగింది.

లక్షిత కుటుంబం ప్రకారం, ఆమె మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. లక్షిత సోమవారం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది, కానీ తిరిగి రాలేదు. ఆ తర్వాత ఆ కుటుంబం పోలీసులకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. హత్య చేసిన అనంతరం నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు మనోజ్.  జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నీలిరంగు డ్రమ్ లో ఉన్న లక్షిత డెడ్ బాడీ(Dead Body) ని స్వాధీనం చేసుకున్నారు. లక్షితను తాను ప్రేమిస్తున్నానని, కానీ ఆమె వేరొకరితో సంబంధంలో ఉందని తెలుసుకున్న కోపంతో ఆమెను చంపేశానని మనోజ్ పోలీసులకు చెప్పాడు.

Also Read :  ఢిల్లీలో కెన్యా, జపాన్‌ దేశాల కోచ్‌లపై వీధి కుక్కల దాడి

చేతులు, కాళ్ళు కట్టేసి

ముందుగా లక్షితను తన ఇంటికి పిలిపించి, ఆమె చేతులు, కాళ్ళు కట్టేసి, నీళ్ళు నింపిన డ్రమ్ములో ముంచి చంపేశాడు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇండోర్‌కు పంపామని, నిందితుడిని విచారిస్తున్నామని దేవాస్ పోలీసు అధికారి తెలిపారు. ఇలాంటి ఘటనలే ఈ ఏడాది దేశంలో చోటుచేసుకున్నాయి. మీరట్‌లో ఒక వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రేమికుడు కలిసి హత్య చేశారు. అనంతరం ఆ మృతదేహాన్ని ముక్కలుగా చేసి డ్రమ్ములో తడి సిమెంట్ కింద పాతిపెట్టారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో కూడా, ఒక వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రేమికుడు కలిసి హత్య చేశారు. అద్దెకు తీసుకున్న ఇంటి మొదటి అంతస్తులో అతని మృతదేహం దొరికింది. అతని ఇంటి యజమాని అయిన వృద్ధ మహిళ డ్రమ్ నుండి దుర్వాసన వస్తున్నట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read :  హ్యాట్సాఫ్.. యుద్ధంలో అన్న వీరమరణం... చెల్లికి దగ్గరుండి పెళ్లి చేసిన తోటి సైనికులు!

ప్రభుత్వ ఉద్యోగంపై ఉన్న ఆశ

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగంపై ఉన్న ఆశ ఓ తండ్రిని అత్యంత క్రూరంగా మార్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన నాలుగో బిడ్డకు జన్మనివ్వడంతో, ఉద్యోగ నిబంధనలకు భయపడి ఆ పసికందును తీసుకెళ్లి దట్టమైన అడవిలో వదిలివెళ్లాడు. అయితే, మూడు రోజుల ఆ పసికందు అదృష్టం బాగుండి, అడవిలోని ఓ పెద్ద బండ కింద క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో చోటుచేసుకుంది.  వెంటనే శిశువును ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ పసికందు ఆరోగ్యంగా ఉన్నాడని ధృవీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేసి, ఆ శిశువు తండ్రి బల్కారి సింగ్ అని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు భయపడి తాను ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Advertisment
తాజా కథనాలు