HYD Crime: హైదరాబాద్‌లో విషాదం.. బాలుడి ప్రాణం తీసిన పానీ పూరీ!

హైదరాబాద్‌లో బాలుడు అక్కతో కలిసి పానీపూరీ తిన్నా క ఇద్దరూ ఇంటికి తిరిగివెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ కారు చిన్నారి అనిల్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు

New Update
annamaianh crime news

hyd crime news

HYD Crime: హైదరాబాద్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఓ కుటుంబం ఇంట విషాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాజుగోపాలం గ్రామానికి చెందిన సూరిబాబు కుటుంబంతో కలిసి కొద్ది నెలల క్రితమే జీవనోపాధి కోసం హైదరాబాద్‌కి వచ్చాడు. అతను నిజాంపేట్‌లోని ప్రశాంతి హిల్స్ రోడ్ నంబర్ 1లో వున్న వెంకట సాయి ప్లాజా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. సూరిబాబు భార్య కుమారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దకూతురు 12 ఏళ్లు కాగా.. చిన్న కుమారుడు అనిల్ కుమార్‌కు 3 సంవత్సరాలు.

పానీపూరీ తిన్నాక.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం అనిల్ తన అక్కతో కలిసి ఇంటికి సమీపంలోని మధురానగర్ కమాన్ వద్ద పానీపూరీ బండికి వెళ్లాడు. పానీపూరీ తిన్నాక ఇద్దరూ ఇంటికి తిరిగి వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ఓ కారు చిన్నారి అనిల్‌ను ఢీకొట్టింది.  దీంతో బాలుడు అనిల్  తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు కేపీహెచ్‌బీలోని ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఎండిన కొబ్బరితో గుండెకు ప్రయోజనకరం.. బరువు తగ్గడానికి బెస్ట్ ఫుడ్

కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతో అల్లారి ముద్దుగా పెరిగిన అనిల్‌ ర్యాష్ డ్రైవింగ్‌కు బలైపోయాడు. కుటుంబాన్ని నిలువరు చేసిన ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానవ జీవితాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వడదెబ్బను నివారించడానికి 5 ఆరోగ్య సంరక్షణ చిట్కాలు మీ కోసమే..!!

(crime news | latest-news | telugu-news | Latest crime news)

Advertisment
తాజా కథనాలు