Surveyor Tejeshwar Incident : పెళ్లైన నెల రోజులకే భర్త హత్య? భర్తను లేపేసి బ్యాంక్ మేనేజర్ తో..

పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానిస్తున్నారు. దీంతో జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాణ్యంలో హత్యకు గురయ్యాడు.

New Update
Surveyor Tejeshwar Incident

Surveyor Tejeshwar Incident

Surveyor Tejeshwar Incident : పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాణ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్‌ నగర్‌ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్‌ లైసెన్స్‌ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్‌ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

ఆరురోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిన తేజేశ్వర్‌ తిరిగి రాలేదు. దీంతో అనుమాన వచ్చి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తేజేశ్వర్‌ ఏపీలోని నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. తేజేశ్వర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తేలింది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

తేజేశ్వర్‌కు మే 18న బీచ్‌పల్లిలో కర్నూలుకు చెందిన యువతితో  వివాహం జరిగింది.-- హత్యకు ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. వివాహం జరిగిన నెల రోజుల వ్యవధిలో తేజేశ్వర్‌ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్‌ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తేజేశ్వర్‌ భార్యతో పాటు అత్తమామలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

పెళ్లికి ముందే తేజేశ్వర్ భార్యకు ఒక బ్యాంక్ మేనేజర్ తో సంబంధం ఉన్నట్లు వారు ఆరోపిస్తున్నారు. అయితే   యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా ఒప్పించి తేజేశ్వర్ తో పెళ్లి చేసినట్లు ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా బ్యాంక్ మేనేజర్ తో యువతి రిలేషన్ కొనసాగిస్తుందని, బ్యాంక్ మేనేజర్ తో నిత్యం ఫోన్లో చాటింగ్, కాల్స్ తో బిజీగా ఉంటుందని తేజేశ్వర్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read : బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..

Advertisment
తాజా కథనాలు