Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారం, డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిపోయే ఘటనలు తరచుగా జరగుతున్నాయి. తాజాగా డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

New Update
Gold

Gold

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారం, డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిపోయే ఘటనలు తరచుగా జరగుతున్నాయి. తాజాగా డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు. దీంతో అతడి వద్ద 7 బంగారు కడ్డీలు లభించాయి. వాటి బరువు 1.8 కిలోలు ఉంది. వీటి విలువ దాదాపు రూ.2.37 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. 

Also Read: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..మల్లోజుల బాటలోనే ఆశన్న.. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా?

గత నెలలో కూడా ఈ ఎయిర్‌పోర్టులో 3.38 కిలోల బంగారాన్ని కూడా ఐరన్ బాక్సలో తరలిస్తుండగా డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ ఏకంగా రూ.3.6 కోట్లు. ఈ ఘటనకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఏపీలోని కడప జిల్లాకు చెందిన వాళ్లుగా గుర్తించారు. అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎక్కువగా కువైట్, దుబాయ్, షార్జా వంటి పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారానే ఎక్కువగా ఇలాంటి అక్రమ రవాణాలు జరుగున్నాయి. 

Also Read: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..అక్కడ మరో మూడు కాలేజీలు

Advertisment
తాజా కథనాలు