Anaganaga Oka Raju: ఏం ఫీలుంది మామ! జోగిపేట్ శ్రీకాంత్ ఈజ్ బ్యాక్ .. ఈ సంక్రాంతికి పండగే

నవీన్ పోలిశెట్టి- మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'అనగనగ ఒక రోజు' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మూవీ ప్రోమో విడుదల చేశారు.

New Update

Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి- మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'అనగనగ ఒక రోజు' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మూవీ ప్రోమో విడుదల చేశారు. రెగ్యులర్ గ్లిమ్ప్స్ వీడియో ఫార్మేట్ లా కాకుండా కాస్త డిఫరెంట్ గా దీనిని ప్లాన్ చేశారు. హీరోయిన్ ఒక జ్యువెలరీ యాడ్ షూట్ చేస్తున్నట్లుగా ప్రోమో మొదలవుతుంది. ఆ తర్వాత హీరో నవీన్ తెరపైకి వచ్చి.. హలో..హలో ఇది జ్యువెలరీ యాడ్ కాదు మన సినిమా ప్రమోషన్ అంటూ ప్రేక్షకులను అలరించారు. 

కలర్ ఫుల్ ప్రోమో

ఇలా ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించేలా ఒక యాడ్ షూట్ స్పూఫ్ తో ప్రొమోను ప్రారంభించి ఆ తర్వాత సినిమాలోని విజువల్స్ చూపించారు. ప్రోమోలో  కలర్ ఫుల్ విజువల్స్, హీరో మాస్ ఎంట్రీ, కామెడీ సీన్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  

ప్రోమో చూస్తుంటే..  పక్కా ఇదొక కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. 'జాతిరత్నాలు ' తర్వాత నవీన్ మరో కామెడీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నట్లు అర్థమైంది. ప్రోమోలో నవీన్- మీనాక్షి మధ్య సన్నివేశాలు అలరించాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. 

రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశాయి. టీజర్ లో నవీన్ లుంగీ కట్టుకొని, బనియన్ లో పల్లెటూరి మాస్ కుర్రాడి గెటప్ లో అదరగొట్టాడు. అనంత్ పెళ్లి లెవెల్లో నా పెళ్లి కూడా  జరగాలి అంటూ నవీన్ డైలాగ్స్ ప్రేక్షకులను అలారించాయి. 

హీరో నవీన్ పోలిశెట్టి పెళ్లి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. హీరో ( రాజు) అనంత్ అంబానీ పెళ్లి రేంజ్ లో చాలా గ్రాండ్ గా చేసుకోవాలని కలలు కంటాడు. మరి రాజు కల నెరవేరిందా? పెళ్లి చేసుకునే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా కథ అని తెలుస్తోంది. 

 Also Read: Singer Zubeen Garg: సింగర్ జుబీన్ గార్గ్ డెత్ కేసులో బిగ్ ట్విస్ట్.. స్టార్ మ్యుజీషియన్ అరెస్ట్!

Advertisment
తాజా కథనాలు