BREAKING: మందు బాబులకు అదిరిపోయే న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు తెలంగాణ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల మందు బాబులకు ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు అందుబాటులోకి వస్తాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశమే.

New Update
wines closed

wines

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు తెలంగాణ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల మందు బాబులకు ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు అందుబాటులోకి వస్తాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశమే. నగరంలో ప్రతీ 5 కి.మీ ఉండగా, పట్టణాల్లో మాత్రం 30 కి.మీలకు మినీ బ్రూవరీలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే త్వరలోనే మద్యం షాపుల లైసెన్స్లకు నోటిఫికేషన్లు జారీ చేయాలని చూస్తోంది. 

ఇది కూడా చూడండి: బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!

స్థానిక సంస్థల ఎన్నికలు..

ఇదిలా ఉండగా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్‌ అమలు చేయాలని భావిస్తున్న రేవంత్‌ రెడ్డి సర్కార్‌ నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని రేవంత్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది.

ఇది కూడా చూడండి: New York Firing: కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి

ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదానికి పంపింది. కానీ, ఆయన ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో కెబినెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు. ఆగష్టు 5వ తేదీన మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులను కలుస్తారు.  అదే సమయంలో  బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇండియా కూటమి మద్దతు కూడా కోరే అవకాశం ఉంది.

ఇది కూడా చూడండి: Shocking: కుక్క ఫ్యామిలీకి రెసిడెన్సీ సర్టిఫికెట్‌.. ఎక్కడో తెలిస్తే షాక్!

మరోవైపు రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నది. మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. వీటన్నింటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రివర్గం చర్చించినట్లు తెలిసింది. కాగా, బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ఎటు తేల్చని సమక్షంలో ఢిల్లీలో దర్నా చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: నిమిష ప్రియా ఉరిశిక్ష రద్దు

Advertisment
తాజా కథనాలు