పర్మిషన్లు లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకునే వారికి షాక్‌..

హైదరాబాద్‌లో ఎలాంటి పర్మిషన్లు లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకునే వారిపై జలమండలి కొరడా ఝళిపిస్తోంది. తాజాగా శంషాబాద్‌లోని ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. వాళ్లు వినియోగిస్తున్న మోటార్లను కూడా స్వాధీనం చేసుకుంది.

New Update
JALAMANDALI

హైదరాబాద్‌లో ఎలాంటి పర్మిషన్లు లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో జలమండలి దీనిపై దృష్టి సారించింది. ఇటీవలే ఓ హోటల్ యజమానిపై సీవరేజ్‌ పైప్‌లైన్‌ విషయంలో జలమండలి చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శంషాబాద్‌లోని ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ పరిధిలోని కుమ్మరి బస్తీ, యాదవ్ బస్తీ, అలాగే కప్పుగడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్న అంజయ్య, మహబూబీ, బాలరాజు, భాస్కర్, కృష్ణ, కుమార్, రవికి రెండేసి నల్లా కనెక్షన్లు ఉన్నాయని జలమండలి గుర్తించింది.  

Also Read: కేవలం రూ.48 చెల్లిస్తే.. నెలంతా అన్ లిమిటెడ్ జర్నీ.. TSRTC బంపరాఫర్!

క్షేత్రస్థాయిలో అధికారులు చెక్‌ చేయగా ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలు లేకపోవడం వల్ల వాళ్లపై ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు నీటి సరఫరాకు వాళ్లు వినియోగిస్తున్న మోటార్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జలమండలి అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైప్‌లైన్‌ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. 

Also Read: లవర్స్ మధ్య చిచ్చు పెట్టిన నాన్‌ వెజ్.. ఒకరు మృతి.. అసలేమైందంటే?

నగరంలో ఇంకా ఎవరైనా అక్రమ నల్లా, సీవరేజ్‌ కనెక్షన్లు గుర్తించినట్లైతే జలమండలి విజిలెన్స్‌ బృందం ఫోన్‌ నంబర్ల ద్వారా 99899-98100, 99899-87135 సమాచారం అందించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. 

Also Read: కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలి: బీజేపీ నేత

Also Read: వావ్.. 'త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో నడిచే రైళ్లు'

Advertisment
Advertisment
తాజా కథనాలు